షర్మిలకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు
నూతనకల్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాకుండా అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. 44వ రోజు పాదయాత్రను ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం నుంచి మిర్యాల క్రాస్‌రోడ్డు, లింగంపల్లి, మాచనపల్లి క్రాస్ రోడ్డు వరకు నిర్వహించారు. లింగంపల్లి సభలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను అన్నివిధాలుగా మోసం చేసి నట్టేట ముం చారని ఆరోపించారు.
ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు టీఆర్‌ఎస్‌కు బీటీ మ్‌గా మారాయని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. సీలింగ్ భూమికి పట్టాలు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మండల కేంద్రం లోని పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. దారిపొడవునా కూలీలు, గీత కార్మి కులను కలసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లింగంపల్లిలో న్యూరోఫైబ్రోమాతోసిస్ వ్యాధిగ్రస్తుడు అంతయ్య తన సమస్యను షర్మిలకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment