నూతనకల్‌లో అభిమానులు ఇచ్చిన కొబ్బరిబొండాంను తాగుతున్న షర్మిల
నూతనకల్: ప్రజలను నమ్మించి మోసం చేయడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కల్పించడంలో విఫలమైన కేసీఆర్ ఉరేసుకొని చనిపోవాలని అన్నారు. ప్రజాప్రస్థా నం పాదయాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా నూ తనకల్ మండలంలోని వెంకేపల్లి, చిల్పకుంట్ల, నూతనకల్‌లో కొనసాగింది.
ఈ సందర్భంగా షర్మిల నూతనకల్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగభృతి అందజేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి వాటిని విస్మరించారని విమర్శించారు. ధాన్యాన్ని చివరిగింజ వరకు కొనుగోలు చేస్తానని మాట్లాడిన ప్రభుత్వపెద్దలు ఇప్పుడు వరి పండిచవద్దని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment