సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై స్థానికులు దాడికి యత్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుందంటూ ఆరోపిస్తూ.. కవిత ఇంటి లోపల టెంటు వేసి నిరసన తెలిపేందుకు స్థానికులు యత్నించారు. దీంతో కవిత అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఆగ్రహంతో కవిత జుట్టు పట్టుకుని స్థానికులు దాడికి దిగారు. తమ స్థలాల్ని కబ్జా చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూమి తిరిగిచ్చేంత వరకు నిరసన తెలుపుతామని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment