
సీఐ సైదానాయక్ (వృత్తంలో ఉన్న వ్యక్తి)
సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున వకల్తా పుచ్చుకుని ప్రచారం చేసిన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కల్మెట్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు సీఐ సైదానాయక్ పై సస్పెన్షన్ వేటుపడింది. అతను గద్వాల్ జోగులాంబ జిల్లా డీసీఆర్బీలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 10 వరకు అతను విధులకు హాజరుకాకుండా హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై నిజామాబాద్ రేంజ్ డీఐజీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.