officer suspenstion
-
వూహాన్లో ఆరు కొత్త కరోనా కేసులు
బీజింగ్/వాషింగ్టన్: ప్రాణాంతక మహమ్మారి కరోనా పుట్టినిల్లు వూహాన్లో సుమారు నెల రోజుల స్తబ్దత తర్వాత ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. వూహాన్‌లోని సాన్‌మిన్ నివాస సముదాయంలో ఈ కొత్త కేసులు నమోదు కాగా.... అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్ చేసింది. ఛాన్‌గోయింగ్ స్ట్రీట్ వర్కింగ్ కమిటీ కార్యదర్శి ఝాంగ్ యుక్సిన్ వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్ చేసినట్లు షిన్హువా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్తగా బయటపడ్డ కేసులన్నీ ఈ ఛాంగ్గోయింగ్ వీధిలోనివే. మరోవైపు, చైనాలోని అన్ని ప్రాంతాల్లోనూ వైరస్ ప్రభావం తగ్గిందనేందుకు సూచనగా ప్రభుత్వం కోవిడ్ రిస్క్ ప్రమాద హెచ్చరికను తగ్గించింది. వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ప్రఖ్యాత షాంఘై డిస్నీల్యాండ్ మళ్లీ మొదలైంది. మైక్ పెన్స్ స్వీయ నిర్బంధం తన సహాయకుడు ఒకరు కరోనాబారిన పడటంతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా పరీక్షల్లో పెన్స్‌కు ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ స్టీఫెన్ హాన్ సైతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సస్పెన్షన్
సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున వకల్తా పుచ్చుకుని ప్రచారం చేసిన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కల్మెట్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు సీఐ సైదానాయక్ పై సస్పెన్షన్ వేటుపడింది. అతను గద్వాల్ జోగులాంబ జిల్లా డీసీఆర్బీలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 10 వరకు అతను విధులకు హాజరుకాకుండా హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై నిజామాబాద్ రేంజ్ డీఐజీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. -
వసూళ్లరాణిపై వేటు
స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశం సాక్షి ప్రతినిధి,కాకినాడ : జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నుంచి ఇండెంట్లు పెట్టి మరీ వసూళ్లకు పాల్ప డ్డ జిల్లా పంచాయతీ కార్యాలయ పరిపాలన ఆధికారిణి ఎం.బాలామణిపై సస్పెన్ష¯ŒS వేటు పడింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి బాలమణి వసూళ్లపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘వసూళ్ల రాణి’ కథనంపై జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా స్పందించారు. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో ఈ విషయమై ఆరా తీశారు. జిల్లాలో ఏ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఎంతెంత వసూలు చేశారు. ఆమె దగ్గరకు వచ్చిన పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ తదితర అంశాలపై ప్రాథమిక విచారణ చేసి అమె వసూళ్లకు పాల్పడినట్టు గుర్తించారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ డీపీపీ కార్యాలయ సిబ్బంది ఆమెకు సస్పెన్ష¯ŒS ఉత్తర్వులు అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి టీవీఎస్‌జీ కుమార్ ధ్రువీకరించారు. తదుపరి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇ¯ŒSచార్జ్ డీపీవో కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. వసూళ్లకు పాల్పడుతున్న బాలమణిని సస్పెండ్ చేయడంతో కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు.