- స్పందించిన కలెక్టర్
- విచారణకు ఆదేశం
వసూళ్లరాణిపై వేటు
Published Mon, May 1 2017 12:09 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
సాక్షి ప్రతినిధి,కాకినాడ :
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నుంచి ఇండెంట్‌లు పెట్టి మరీ వసూళ్లకు పాల్ప డ్డ జిల్లా పంచాయతీ కార్యాలయ పరిపాలన ఆధికారిణి ఎం.బాలామణిపై సస్పెన్ష¯ŒS వేటు పడింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి బాలమణి వసూళ్లపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘వసూళ్ల రాణి’ కథనంపై జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా స్పందించారు. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో ఈ విషయమై ఆరా తీశారు. జిల్లాలో ఏ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఎంతెంత వసూలు చేశారు. ఆమె దగ్గరకు వచ్చిన పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ తదితర అంశాలపై ప్రాథమిక విచారణ చేసి అమె వసూళ్లకు పాల్పడినట్టు గుర్తించారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ డీపీపీ కార్యాలయ సిబ్బంది ఆమెకు సస్పెన్ష¯ŒS ఉత్తర్వులు అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి టీవీఎస్‌జీ కుమార్ ధ్రువీకరించారు. తదుపరి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇ¯ŒSచార్జ్ డీపీవో కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. వసూళ్లకు పాల్పడుతున్న బాలమణిని సస్పెండ్ చేయడంతో కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement