
సూర్యాపేట: బండి సంజయ్ రెండోరోజు పర్యటనలో ఆయన వెంట వచ్చిన గూండాలు రైతుల మీద పాశవికంగా దాడి చేశారని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యుత్‌మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అని నిలదీసినందుకే గూండాయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడులను తిప్పికొట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి జగదీశ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.