
సూర్యాపేట/ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట)/తిరుమలగిరి: వానాకాలం సీజన్‌లో పండించిన చివరి గింజనూ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మంగళవారం సూర్యా పేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. కోడిగుడ్ల దాడి, రాళ్లు, చెప్పుల దెబ్బలు ఎన్నైనా భరిస్తామని, రైతుల పక్షాన దేనికైనా తెగించి కొట్లాడుతామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య కాదని, ఇది రైతుల సమస్య అని పేర్కొన్నారు.
వానాకాలం పంటకు సంబంధించి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని కేంద్రం అగ్రిమెంట్ చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి, కొనుగోళ్లు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి బీజేపీ పర్యటన చేస్తుంటే.. అన్ని కేంద్రాల్లో రైతులను బెదిరించి, ఎవ్వరు కూడా అక్కడ లేకుండా టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేసిందన్నారు. అయినా రైతులు బయట కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. సోమవారం జరిగిన దాడు లకు ప్రధాన సూత్రధారి సీఎం కేసీఆరేనన్నారు.
కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగాలి..
తెలంగాణలో పండించిన పంటను అమ్ముకోవడా నికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, రైతుల దుస్థితి చూసైనా కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగాలని బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాలకు వెళ్లి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.
అనంతరం తిరుమలగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ముసుగులో టీఆర్‌ఎస్ నాయకులు ఒక్కొక్కరికి రూ.200, రూ.500, రూ.1000 ఇచ్చి, మద్యం తాపించి కిరాయి గూండాలతో తమపై దాడులు చేయించారని సంజయ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలS దౌర్జన్యాలపై రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేస్తే కనీసం ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment