
సాక్షి, నల్లగొండ: సూర్యపేట జిల్లా చివ్వెం ఐకేపీ సెంటర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐకేపీ సెంటర్‌ను సందర్శించేందుకు వచ్చిన బండి సంజయ్‌ను స్థానిక టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లజండాలతో నిరసనలు తెలిపారు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు.
పోలీసులు పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని మోహరించారు. ఈ నేపథ్యంలో.. బండి సంజయ్ మాట్లాడుతూ.. రైతుల సమస్యల కోసం ఎందాకైనా పోరాడతామని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment