బ్రిటన్‌కి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో, ఇండియాలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని షేక్‌పేటలో ఏర్పాటు చేసిన వన్ మోటో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను రాష్ట్ర వాణిజ్య పరిశమ్రలు శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
వన్ మోటో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఈ మొబిలిటీ పెంచేందుకు దేశమంతటా అన్ని స్థాయిల్లో విస్త్రృత ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వన్ మోటో వంటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజల్లోకి మరింత సులువుగా చొచ్చుకుపోతాయని ఆయన తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై చాలా మందికి ఆసక్తి ఉంది, ఇదే సమయంలో అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, పని చేసే తీరు, చార్జింగ్ పెట్టే పద్దతులు ఇలా ఈవీలకు సంబంధించి ప్రత్యక్ష అనుభవాన్ని కస్టమర్లకు అందించేందుకు ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని అందుబాటులోకి తెచ్చిన్నట్టు వన్‌మోటో ఇండియా ఫౌండర్ మహ్మద్ ముజామిల్ రియాజ్ తెలిపారు. వన్‌మోటో బ్రాండ్ కింద కమ్యూటా, బైకా, ఎలక్ట్రా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్లు 9 రంగుల్లో లభిస్తున్నాయి.
కమ్యూటా ఫీచర్లు
టాప్ స్పీడ్ 75 కేఎంపీహెచ్
సింగిల్ ఛార్జ్‌పై 100 కి.మీ ప్రయాణం
ధర రూ.1.30 లక్షలు
బైకా ఫీచర్లు
టాప్ స్పీడ్ 105 కేఎంపీహెచ్
సింగిల్ ఛార్జ్‌పై 180 కి.మీ ప్రయాణం
ధర రూ. 1.91 లక్షలు
ఎలక్ట్రా ఫీచర్లు
టాప్ స్పీడ్ 100 కెఎంపీహెచ్
సింగిల్ ఛార్జ్‌పై 150 కి.మీలు
ధర రూ.1.99 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment