ఎర్రటి ఎండలో చల్లని హృదయం | Woman helps rickshaw puller push heavy cart on flyover | Sakshi
Sakshi News home page

ఎర్రటి ఎండలో చల్లని హృదయం

Published Sun, Jun 9 2024 6:26 AM | Last Updated on Sun, Jun 9 2024 6:26 AM

Woman helps rickshaw puller push heavy cart on flyover

వైరల్‌

భయానకమైన ఎండలో పెద్ద ఏసీ మెషిన్‌తో ఫ్లైఓవర్‌ దాటడానికి ఆపసో΄ాలు పడుతున్న రిక్షా కార్మికుడిని చూసిన ఒక మహిళ బాధపడింది. అయితే ఆమె బాధ పడి ఊరుకోలేదు. అతడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లింది.

 రిక్షాను నెట్టుతూ అతడు ఫ్లై ఓవర్‌ దాటేలా సహాయపడింది. ఆ తరువాత లంచ్‌బాక్స్, వాటర్‌ బాటిల్‌ అతడికి ఇచ్చింది. తలపై కప్పుకోవడానికి టవల్‌ కూడా ఇచ్చింది. దారిన ΄ోయేవాళ్లెవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ‘ఎక్స్‌’లో ΄ోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది.

‘ఎక్కడో ఒకచోట కష్టపడుతున్న వ్యక్తుల్ని చూస్తుంటాం. బాధ అనిపిస్తుందిగానీ, నేను మాత్రం ఏం చేయగలను అని సర్దిచెప్పుకుంటాం. అయితే మన వంతుగా వారికి కొద్దో గొ΄్పో సహాయపడగలిగితే అది గొప్ప సంతృప్తిని ఇస్తుంది’ అంటూ ఒక యూజర్‌ కామెంట్‌ పెట్టాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement