cart pulling race
-
ఎర్రటి ఎండలో చల్లని హృదయం
భయానకమైన ఎండలో పెద్ద ఏసీ మెషిన్‌తో ఫ్లైఓవర్ దాటడానికి ఆపసో΄ాలు పడుతున్న రిక్షా కార్మికుడిని చూసిన ఒక మహిళ బాధపడింది. అయితే ఆమె బాధ పడి ఊరుకోలేదు. అతడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లింది. రిక్షాను నెట్టుతూ అతడు ఫ్లై ఓవర్ దాటేలా సహాయపడింది. ఆ తరువాత లంచ్‌బాక్స్, వాటర్ బాటిల్ అతడికి ఇచ్చింది. తలపై కప్పుకోవడానికి టవల్ కూడా ఇచ్చింది. దారిన ΄ోయేవాళ్లెవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ‘ఎక్స్’లో ΄ోస్ట్ చేశారు. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది.‘ఎక్కడో ఒకచోట కష్టపడుతున్న వ్యక్తుల్ని చూస్తుంటాం. బాధ అనిపిస్తుందిగానీ, నేను మాత్రం ఏం చేయగలను అని సర్దిచెప్పుకుంటాం. అయితే మన వంతుగా వారికి కొద్దో గొ΄్పో సహాయపడగలిగితే అది గొప్ప సంతృప్తిని ఇస్తుంది’ అంటూ ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. -
పందెపు గిత్తకు రూ.8 లక్షలు
బాపట్ల టౌన్: బండలాగుడు పోటీల్లో వరుసగా బహుమతులు గెల్చుకుంటూ పశుపోషకుల మన్ననలు పొందిన ఓ గిత్తకు రూ.8 లక్షల రూపాయల ధర లభించింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన వెంకటేశ్వర్లు రెండున్నరేళ్ల కిందట రూ.9 లక్షలు వెచ్చించి ఏడాది వయసుగల నాలుగు కోడెదూడల్ని కొనుగోలు చేశారు. వాటికి ముత్తాయపాలెంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేశారు. ఈ ఒంగోలు జాతి గిత్తలు బరిలో దిగితే బహుమతి ఖాయం అన్నట్టు గుర్తింపు పొందాయి. ఓ గిత్తను గురువారం కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన బి.ఎస్.ఎస్.రెడ్డి రూ.8 లక్షలకు కొనుగోలు చేశారు.