పందెపు గిత్తకు రూ.8 లక్షలు | this guntur gitta price rs 8 lakh | Sakshi
Sakshi News home page

పందెపు గిత్తకు రూ.8 లక్షలు

Published Fri, Dec 25 2015 1:49 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

పందెపు గిత్తకు రూ.8 లక్షలు - Sakshi

పందెపు గిత్తకు రూ.8 లక్షలు

బాపట్ల టౌన్: బండలాగుడు పోటీల్లో వరుసగా బహుమతులు గెల్చుకుంటూ పశుపోషకుల మన్ననలు పొందిన ఓ గిత్తకు రూ.8 లక్షల రూపాయల ధర లభించింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన వెంకటేశ్వర్లు రెండున్నరేళ్ల కిందట రూ.9 లక్షలు వెచ్చించి ఏడాది వయసుగల నాలుగు కోడెదూడల్ని కొనుగోలు చేశారు.

వాటికి ముత్తాయపాలెంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేశారు. ఈ ఒంగోలు జాతి గిత్తలు బరిలో దిగితే బహుమతి ఖాయం అన్నట్టు గుర్తింపు పొందాయి. ఓ గిత్తను గురువారం కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన బి.ఎస్.ఎస్.రెడ్డి రూ.8 లక్షలకు కొనుగోలు చేశారు.         

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement