
వీడియోకాన్ నుంచి సౌర ఏసీలు
వీడియోకాన్ కంపెనీ సౌర శక్తితో పనిచేసే హైబ్రిడ్ సోలార్ ఎయిర్‌కండీషనర్లను మార్కెట్లోకి తెచ్చింది. సౌరశక్తితో పనిచేసే ఈ హైబ్రిడ్ సోలార్ ఏసీలను రెండు మోడళ్లలలో అందిస్తున్నామని, వీటి వల్ల వంద శాతం విద్యుత్ ఆదా అవడమే కాకుండా పర్యావరణానికి మేలు కలుగుతుందని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అవసరమైనప్పుడు విద్యుత్‌ను కూడా వినియోగించుకుంటుందని వీడియోకాన్ హెడ్( టెక్నాలజీ, ఇన్నోవేషన్ విభాగం) అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. 1 టన్ను ఏసీలధర రూ.99,000, 1.5 టన్నుల ఏసీ ధర రూ.1,39,000 రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు.