రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు క్రికెట్ మైదానానికి కూడా విస్తరించింది. ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లో మైదానంలో అంపైర్లు, థర్డ్ అంపైర్ మధ్య జరిగే సంభాషణలను అభిమానులకు వినిపించాలని నిర్ణయించారు.
రివ్యూలు, ఔట్‌కు సంబంధించిన అనుమానాల నివృత్తికి చేసే సంప్రదింపులను ఇక మీదట అందరూ వినే అవకాశం కల్పించే కొత్త టెక్నాలజీకి ఐసీసీ కూడా గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2015 వరల్డ్ కప్‌లో కూడా అమలుచేసే అంకాశం ఉందని ఐసీసీ తెలిపింది.