న్యూఢిల్లీ: కేన్సర్ కణతులను ఒకే జన్యుపరీక్షతో గుర్తించేందుకుగాను రాజీవ్‌గాంధీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్‌చ సెంటర్ (ఆర్‌జీసీఐ అండ్ ఆర్‌సీ)లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. మల్జీజీన్ ట్యూమర్ ప్రొఫైల్ (ఎంటీపీ) అనే ఈ పరీక్షతో కేన్సర్‌ను పది రోజుల్లోనే గుర్తించేందుకు వీలవుతుందని ఆర్‌జీసీఐ వ్యాధివిజ్ఞాన విభాగం చీఫ్ డాక్టర్ అనురాగ్ మెహతా వెల్లడించారు.
ప్రస్తుతం కేన్సర్‌కు జన్యుపరమైన కారణాలను గుర్తించేందుకు కొన్ని జన్యుపరీక్షలు వరుసగా చేయాల్సి ఉంటుందని, ఫలితాలు తెలుసుకునేందుకు మూడు వారాలకు పైగా సమయం పడుతుందని మెహతా తెలిపారు. ఎంటీపీ టెక్నాలజీ వల్ల ఒకే పరీక్ష చేయడంతోపాటు ఫలితాలనూ త్వరగా తెలుసుకోవచ్చన్నారు.
కేన్సర్‌ను గుర్తించేందుకు ఒకే జన్యుపరీక్ష
Published Wed, Oct 2 2013 5:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement