హింస లేకుండా, రక్తం చిందకుండా గొడవలేకుండా చల్లగా చక్క బెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న, సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త టెక్నాలజీతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.
హింస లేకుండా, రక్తం చిందకుండా గొడవలేకుండా చల్లగా చక్క బెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న, సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త టెక్నాలజీతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఏదో ప్రక్క రాష్ట్రం నుంచి మోసం చేయటం మళ్లీ అక్కడ మకాం ఎత్తి వేరేచోట చేయటం.. పోలీసులు అప్రమత్తం అయ్యేసరికి పుణ్య కాలం కాస్తా గడచిపోవడం, ఇదే నేరగాళ్లు మళ్లీ వేరే రాష్ర్టం నుంచి నేరాలు చేయడం వాళ్లను పట్టుకోడం మన పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమి స్తోంది. అంతేకాకుండా మన పోలీసుల దగ్గరున్న సాంకే తిక పరిజ్ఞానం అంతంత మాత్రమే అయినందున సైబర్ నేరాలకు కళ్లెం వేయడానికి కొత్త పద్ధతులు అందుబాటులో లేవు. ఆ దిశగా ఇప్పుడు ఖాకీలు ప్రయత్నాలు చేస్తున్నారు. నిపుణులైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఖాకీ బట్టలు వేసి, నేరాలను అరికట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. రోజూ ఏదో ఒకరూపంలో సామాన్య మధ్యతరగతి ప్రజానీకం మోసపోతూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా ఫలితం మా త్రం శూన్యం. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నేరగాళ్లను, ఎలాగైనా పట్టుకునేందుకు ప్రస్తుతం పథ కాలు పన్నుతున్నారు. పోలీసుశాఖ ప్రయత్నం ఫలించాలని ఆశ్దిదాం?
- శిష్టా మురళి సుధాకర్ చందానగర్, హైదరాబాద్