
శాన్ఫ్రాన్సిస్కో: వాట్సాప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్. స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా ఒకేసారి నాలుగు డివైజ్‌లకు అకౌంట్ లాగిన్ అయ్యి వాడుకునేలా ఫీచర్ త్వరలో రాబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో విల్ క్యాథ్‌కార్ట్ ధృవీకరించారు.
వ్యాబేటాఇన్ఫో ఇంటర్వ్యూలో విల్ క్యాథ్‌కార్ట్ మాట్లాడుతూ.. వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో లాగిన్ అయ్యేలా ఫీచర్ తేబోతున్నాం. ఈ సౌకర్యంతో ఐప్యాడ్‌లో వాట్సాప్ లాగిన్ అయ్యేందుకు వీలు ఉంటుంది(ఇంతవరకు ఆ సపోర్ట్ లేదు). ప్రస్తుతం వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యాప్ కోసం స్మార్ట్ ఫోన్‌తో లాగిన్(స్కాన్) చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మీదట మెయిన్ యాప్, స్మార్ట్ ఫోన్ యాప్ సపోర్ట్ లేకుండా మల్టీ డివైజ్ ఫీచర్(లింక్)తో లాగిన్ కావొచ్చు అని ఆయన వివరించాడు.
కాగా, ఈ విషయాన్ని మార్క్ జుకర్‌బర్గ్ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ప్రైవసీ సమస్యలున్నప్పటికీ దీన్నొక టెక్నికల్ ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించాం. ఫోన్ స్విచ్ఛాప్ అయినా కూడా మల్టీ డివైజ్ లాగిన్ ద్వారా వాట్సాప్ పని చేసేలా ఫీచర్ పరిశీలనలో ఉంది అని జుకర్‌బర్గ్ తెలిపాడు. అలాగే ‘వ్యూ వన్స్’.. అవతలి యూజర్ ఒకసారి ఫొటో, వీడియో చూడగానే దానంతట అదే మాయమయ్యే ఫీచర్ కూడా ఫ్యూచర్ అప్డేట్ పరిశీలనలో ఉందని గుర్తు చేశాడు. చదవండి: వాట్సాప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment