సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగంగా కొత్త టెక్నాలజీని ఆహ్వానిస్తోందని సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు.
కంపెనీ సీఎండీ ఎన్.శ్రీధర్
కొత్తగూడెం: సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగంగా కొత్త టెక్నాలజీని ఆహ్వానిస్తోందని సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 66 మిలియన్ టన్నుల లక్ష్యం నుంచి భవిష్యత్‌లో 100 మిలియన్ టన్నుల లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాం.. ఈ నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యం, శిక్షణ తదితర విషయాల్లో ఇతర దేశాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం వ్యాపార అభివృద్ధిలో భాగంగా సింగరేణిలోని అవకాశాలపై చర్చించడానికి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రీవ్ మెక్ అల్లిస్టర్ గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఎండీతో భేటీ అయ్యూరు. బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ తమ దేశం తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార అభివృద్ధి, జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై ఆసక్తి చూపుతోందన్నారు.
సింగరేణి సంస్థలోనూ వ్యాపార లావాదేవీలు నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. సీఎండీ మాట్లాడుతూ కంపెనీ అవసరాలు, అవకాశాలపై అధ్యయనం చేసిన అనంతరం తలపెట్టదలచిన లావాదేవీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమర్పిస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. త్వరలోనే ఒక అధ్యయన బృందాన్ని సింగరేణికి పంపిస్తామని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ తెలిపారు. సమావేశంలో యునెటైడ్ కింగ్‌డమ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.