శస్త్రచికిత్సల్లో శిక్షణకు రోగులపైనే తొలి ప్రయోగం అవసరం లేదని, వీడియోగేమ్ తరహాలో కూడా శిక్షణ పొందే కొత్త టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని భారత వైద్య మండలి(ఎంసీఐ) సభ్యులు డా. గన్ని భాస్కరరావు వెల్లడించారు.
ఎంసీఐ సభ్యులు డా.భాస్కరరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: శస్త్రచికిత్సల్లో శిక్షణకు రోగులపైనే తొలి ప్రయోగం అవసరం లేదని, వీడియోగేమ్ తరహాలో కూడా శిక్షణ పొందే కొత్త టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని భారత వైద్య మండలి(ఎంసీఐ) సభ్యులు డా. గన్ని భాస్కరరావు వెల్లడించారు. బుధవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ పరికరంలో స్టిమ్యులేటర్ (అనుకరణ)తో నేరుగా రోగికి ఎలా శస్త్రచికిత్స నిర్వహిస్తామో అలాగే చేసే ప్రక్రియ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ పద్ధతిలో అనుభవం వచ్చిన తర్వాత రోగులకు శస్త్రచికిత్స చేయవచ్చన్నారు. ప్రస్తుతం గుండె, కాలేయం, గర్భాశయ వ్యాధులు, తదితర వాటికి శస్త్రచికిత్సలను ఈ పద్ధతిలో చేసేందుకు వీలుందన్నారు. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో ఈ నెల 16 నుంచి 20 వరకూ ఈ విధానంపై 20 మంది వైద్యులకు శిక్షణనివ్వనున్నామన్నారు.