క్రిస్‌మస్‌ రోజు భారీగా గుండెపోట్లు! | Heart Attacks Most Likely To Happen On Christmas Eve | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 14 2018 2:41 AM | Last Updated on Fri, Dec 14 2018 2:41 AM

Heart Attacks Most Likely To Happen On Christmas Eve - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లండన్‌: క్రిస్‌మస్‌ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మధ్య రోగులు, వృద్ధులు భారీ సంఖ్య లో గుండెపోటుకు గురవుతారని తాజా అధ్యయనం లో తేలింది. స్వీడన్‌లోని ఉప్సలా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. తొలుత పరిశోధకులు స్వీడన్‌లో 1998 నుంచి 2013 వరకు అన్ని సెలవు దినాలు, పెద్ద స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ ఉన్న రోజు ల్లో నమోదైన గుండెపోటు వివరాలను సేకరించారు. ఈ 16 ఏళ్లలో 2,83,014 మంది గుండెపోటుకు గురి కాగా, ఇందులో 15% మంది క్రిస్‌మస్‌ నాడే గుండె పోటుకు గురైనట్లు గుర్తించారు.

తరువాతి స్థానంలో వేసవి రోజుల్లో 12% మందికి గుండెపోటు వచ్చింది. న్యూ ఇయర్‌ రోజు, సోమవారపు ఉదయాలు కూడా ముప్పు తీవ్ర స్థాయిలోనే ఉందని తేల్చారు. క్రిస్‌మస్‌ సాయంత్రం ఈ ముప్పు 37% అధికంగా ఉంటుందన్నారు. క్రిస్‌మస్‌ రోజు అందరిలో భావో ద్వేగపూరిత ఒత్తిడి ఉండటమే గుండెపోటుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.   ఈ వివరాలు బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement