గుండెపోటు లక్షణాలను కచ్చితంగా గుర్తించగల స్మార్ట్‌ఫోన్ ఆధారిత టెక్నాలజీని ఇంటర్‌మౌంటెయిన్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది గుండెపోటని గుర్తించలేరని, ఫలితంగా విలువైన సమయం కాస్తా నష్టపోవడం ద్వారా ప్రాణాలు కోల్పోయే ప్రమాద ముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బ్రెంట్ ముహెల్‌స్టీన్ తెలిపారు. పూడిపోయిన రక్తనాళానికి వీలైనంత తొందరగా సరఫరాను పునరుద్ధరిస్తే గుండెకు, ఆరోగ్యానికి కూడా మేలని ఆయన గుర్తుచేశారు.
సంప్రదాయ ఈసీజీతో గుండె విద్యుత్తు కార్యకలాపాలను గుర్తించేందుకు వీలవుతుంది. అయితే ఇందులో శరీరంలోని 12 భాగాల నుంచి వివరాలు సేకరిస్తారు. కానీ తాజాగా రూపొందించిన పరికంలో మాత్రం రెండే రెండు లీడ్స్ ఉంటాయి. శరీరంపై దీన్ని అటు ఇటు కదిలించడం ద్వారా మొత్తం 12 చోట్ల వివరాలను సేకరిస్తారు. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా వివరాలన్నింటినీ సేకరించి విశ్లేషించవచ్చు. ఛాతీనొప్పితో బాధపడుతున్న కొంతమందిపై తాము ఈ కొత్త పరికరాన్ని ప్రయోగించి చూశామని, సంప్రదాయ ఈసీజీకి ఏమాత్రం తీసిపోని ఫలితాలు వచ్చాయని బ్రెంట్ వివరించారు. అరచేతిలో ఇమిడిపోయే పరికరం ద్వారా గుండెపోటును తక్కువ సమయంలోనే కచ్చితంగా గుర్తించగలిగితే చాలా
Comments
Please login to add a commentAdd a comment