గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..! | Know Some Common Medical Tests To Diagnose Heart Conditions, How Do I Know If My Heart Is OK? | Sakshi
Sakshi News home page

గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..

Published Sun, Sep 29 2024 11:31 AM | Last Updated on Sun, Sep 29 2024 12:31 PM

Common Medical Tests To Diagnose Heart Conditions

గుండెపోట్లు ఇప్పుడు మరీ చిన్న వయసులోనూ వస్తున్నాయి. ఆ ముప్పునుంచి రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న పరీక్షలూ, వాటి ప్రయోజనాలను తెలుసుకుందాం. 

ఈసీజీ : ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తికీ తప్పనిసరి. ఇందులో గుండెపోటు 80, 90 శాతం నిర్ధారణ అవుతుంది. గతంలో గుండెపోటు వచ్చి ఉండి, అప్పుడా విషయం బాధితుడికి తెలియకపోయినా ఈ పరీక్షతో తెలిసిపోతుంది. 

అయితే కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా ఒక్కోసారి గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈసీజీ పరీక్ష నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీసిచూడాలి.

టు డీ ఎకో పరీక్ష : ఇది గుండెస్పందనల్లో, గుండె కండరంలో వచ్చిన మార్పులను తెలుపుతుంది. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెజబ్బు కారణంగానే అని తెలుసుకునేందుకు ‘ఎకో’ పరీక్షలో 95 శాతం కంటే ఎక్కువే అవకాశాలుంటాయి.  

టీఎమ్‌టీ పరీక్ష : ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ అని పిలిచే ఈ పరీక్షను ‘కార్డియాక్‌ స్ట్రెస్‌ టెస్ట్‌’ అని కూడా అంటారు. నడకలో గుండెపనితీరు తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది. బాధితులకు గుండెపోటుకు కారణమైన కరొనరీ ఆర్టరీ డిసీజ్‌ (సీఏడీ) ఉందా లేదా అని తెలియజెప్పే పరీక్ష ఇది. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోని అడ్డంకులనూ ఈ పరీక్ష గుర్తిస్తుంది. గుండె లయ (రిథమ్‌)లో ఉన్న లోపాలను పసిగడుతుంది. 

యాంజియోగ్రామ్‌: గుండెపోటు అని డౌట్‌ వచ్చినప్పుడు కచ్చితంగా నిర్ధారణ చేసే మరో పరీక్ష యాంజియోగ్రామ్‌. కొన్నిసార్లు ఈసీజీలో మార్పులు స్పష్టంగా లేకపోయినా, 2 డీ ఎకో సరైన క్లూస్‌ ఇవ్వలేకపోయినా అవన్నీ ఈ పరీక్షలో తెలిసిపోతాయి. 

అంతేకాదు గుండె రక్తనాళాల కండిషన్, వాటిల్లోని అడ్డంకులు కచ్చితంగా తెలుస్తాయిగానీ ఈసీజీ, ఎకోలతో  పోలిస్తే ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. 

హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు:  గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపు రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌ అనే రసాయనాలు పెరుగుతాయి. ఈ రక్త పరీక్ష ద్వారా ఎంత చిన్న గుండెపోటు అయినా అది కచ్చితంగా నిర్ధారణ అవుతుంది.  

(చదవండి: ఓ డాక్టర్‌ హార్ట్‌ బిట్‌..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement