
సామాజిక స్పృహతో 17 ఏళ్ల స్వీడన్ అమ్మాయి అందరి మన్ననలు పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే..స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తన పుట్టిన రోజు సందర్బంగా స్వీడన్ పార్లమెంట్ వెలుపల ఏడు గంటల పాటు నిరసన చేపట్టారు. ఆమె ప్రతి శుక్రవారం పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపడుతుంటారు. పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా వీక్లీ ఫ్రైడే నిరసన కార్యక్రమం చేపడుతున్నందుకు థన్‌బర్గ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. థన్‌బర్గ్ స్పందిస్తూ..తాను ఎప్పటిలాగే ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిరసన దీక్ష చేపట్టానని తెలిపింది. తనకు పుట్టిన రోజున కేక్ దొరక్కపోవచ్చు కానీ, మనమందరం డిన్నర్ చేద్దామని భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మాట్లాడింది.
తాను గత ఏడాది కాలంగా చాలా బిజీగా ఉన్నానని.. జీవితంలో ఏ సాధించాలో సరియైన అవగాహన వచ్చిందని తెలిపింది. తాను చేస్తున్న కార్యక్రమాలు ప్రభావం చూపుతున్నాయని థన్‌బెర్గ్ హర్షం వ్యక్తం చేశారు. ధన్‌బర్గ్ పదిహేనేళ్ల వయస్సు నుంచే ప్రతి శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టి..స్వీడన్ పార్లమెంట్ వెలుపల కార్బన్ ఉద్గారాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేవారు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలకు ప్రేరణ కలిగించారు. ఆమె చేస్తున్న కృషికి టైమ్స్ పర్స్‌న్ ఆఫ్ ది ఇయర్(2019) అవార్డు లభించింది.
చదవండి: ట్రంప్– గ్రెటా ట్వీట్ వార్!
Comments
Please login to add a commentAdd a comment