
శ్మశాన వాటికలో 8,400 ఏళ్లనాటి శునక అవశేషాలు
స్టాక్‌హోమ్ : దక్షిణ స్వీడన్‌లో అతి పురాతన కాలంనాటి శునక అవశేషాలు బయటపడ్డాయి. గత గురువారం అక్కడి ఓ శ్మశాన వాటికలో మధ్య రాతి యుగానికి చెందిన శునక అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఆ శునకాన్ని పాతిపెట్టి దాదాపు 8,400 ఏళ్లయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆకస్మికంగా సముద్ర మట్టం పెరగటం వల్ల శ్మశాన వాటికలోకి వచ్చి చేరిన బురద కారణంగా ఆ ప్రదేశం మొత్తం భద్రపరచబడిందని చెబుతున్నారు. దీంతో అక్కడి అవశేషాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదంటున్నారు. ( వైరల్: అతడు ముక్కు కత్తిరించేసుకున్నాడు! )
ఆ శునకాన్ని ఓ వ్యక్తి పాతి పెట్టాడని, పెంచుకున్నవి చనిపోయినపుడు గుర్తుగా ఏదైనా వదలిపెట్టడం అప్పటి ఆచారం అని చెబుతున్నారు. కాగా, ఆ శునకానికి సంబంధించిన అవశేషాలను ఇంకా భూమిలోంచి బయటకు తీయలేదు. వాటిని వెలికి తీసిన వెంటనే బ్లెకింగ్ మ్యూజియానికి తరలించటానికి పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment