వోల్వో ఎక్స్‌సీ–40 @రూ. 39.9 లక్షలు  | 2018 Volvo XC 40 Momentum Review | Sakshi
Sakshi News home page

వోల్వో ఎక్స్‌సీ–40 @రూ. 39.9 లక్షలు 

Published Thu, Jul 5 2018 12:36 AM | Last Updated on Thu, Jul 5 2018 12:36 AM

 2018 Volvo XC 40 Momentum Review - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన కొత్త ఎంట్రీ లెవెల్‌ ఎస్‌యూవీ ‘ఎక్స్‌సీ–40’ని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వోల్వో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రంప్‌ ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించారు. కాంపాక్ట్‌ మాడ్యులర్‌ ఆర్కిటెక్ట్‌లో ఇదే ప్రథమ మోడల్‌ అని చార్లెస్‌ తెలిపారు.

రాడార్‌ ఆధారిత రక్షణ వ్యవస్థ దీని ప్రత్యేకత. రాత్రిపూట సైతం కారు ముందున్న అతి సూక్ష్మ వస్తువులను సైతం గుర్తించి కారు లోపల 9 అంగుళాల టచ్‌ స్రీన్‌ డిస్‌ప్లేలో చూపిస్తుంది. 2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు «ప్రారంభ ధర రూ. 39.9 లక్షలు. ఎక్స్‌సీ–40లో 7 ఏయిర్‌ బ్యాగులు, మొబైల్‌ చార్జింగ్, ఆండ్రాయిడ్‌ ఆటో వంటి పలు ప్రత్యేకలున్నాయని కంపెనీ తెలిపింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement