Volvo XC60
-
అప్పుడు BMW బైక్, ఇప్పుడు లగ్జరీ కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ
అర్జున్ రెడ్డి భామ, బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ లహరి షారి కొత్త కారు కొనుగోలు చేసింది. మహాశివరాత్రి పండగ సందర్భంగా లగ్జరీ కారు వోల్వో ఎక్స్‌సీ 60ని తనకు తాను బహుమతిగా ఇచ్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న భామ ఈ మేరకు కారు ముందు నిల్చుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కారు ధర ఎంతకాదన్నా 60 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలుస్తోంది. గత నెలలో ఈ బ్యూటీ ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ బైక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే! కాగా బిగ్‌బాస్ తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్‌లో నటించిన లహరి కొన్ని సినిమాలకు సైతం సంతకం చేసినట్లు సమాచారం! View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
వోల్వో ఎక్స్‌సీ–40 @రూ. 39.9 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన కొత్త ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘ఎక్స్‌సీ–40’ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వోల్వో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించారు. కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్ట్‌లో ఇదే ప్రథమ మోడల్ అని చార్లెస్ తెలిపారు. రాడార్ ఆధారిత రక్షణ వ్యవస్థ దీని ప్రత్యేకత. రాత్రిపూట సైతం కారు ముందున్న అతి సూక్ష్మ వస్తువులను సైతం గుర్తించి కారు లోపల 9 అంగుళాల టచ్ స్రీన్ డిస్ప్లేలో చూపిస్తుంది. 2 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు «ప్రారంభ ధర రూ. 39.9 లక్షలు. ఎక్స్‌సీ–40లో 7 ఏయిర్ బ్యాగులు, మొబైల్ చార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో వంటి పలు ప్రత్యేకలున్నాయని కంపెనీ తెలిపింది. -
వోల్వో లగ్జరీ కార్లలో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా రెండు మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్‌లో బాగా అమ్ముడయ్యే మోడళ్లలోని ఎస్ 60, ఎక్స్‌సీ60 కార్లలో కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ పేర్కొంది. ఎస్ 60 ధరలు రూ.29.90 లక్షల నుంచి రూ.35.50 లక్షలు, క్రాసోవర్ ఎస్యూవీ, ఎక్స్‌సీ 60 ధరరూ.40.50 లక్షల నుంచి రూ.46.55 లక్షల(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని వివరించింది. గత ఏడాది 811 కార్లు అమ్ముడయ్యాయని, ఈ ఏడాది వెయ్యి కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వోల్వో ఆటో ఇండియా ఎండీ టోమస్ ఇర్న్బర్ చెప్పారు. 2020 కల్లా ఏడాదికి 20 వేల కార్లను అమ్మడం లక్ష్యమని పేర్కొన్నారు.