అర్జున్ రెడ్డి భామ, బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ లహరి షారి కొత్త కారు కొనుగోలు చేసింది. మహాశివరాత్రి పండగ సందర్భంగా లగ్జరీ కారు వోల్వో ఎక్స్‌సీ 60ని తనకు తాను బహుమతిగా ఇచ్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న భామ ఈ మేరకు కారు ముందు నిల్చుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కారు ధర ఎంతకాదన్నా 60 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలుస్తోంది. గత నెలలో ఈ బ్యూటీ ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ బైక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే! కాగా బిగ్‌బాస్ తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్‌లో నటించిన లహరి కొన్ని సినిమాలకు సైతం సంతకం చేసినట్లు సమాచారం!
Comments
Please login to add a commentAdd a comment