బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. వీరిలో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి, లహరి షారి మూటాముల్లె సర్దుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే వీరిలో లహరి ఎలిమినేషన్ సరి కాదంటున్నాడు బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా. ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని చెప్తున్నాడు. షోలోకి ఆమె రీఎంట్రీ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడుతున్నాడు.
ఈమేరకు లహరితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు కౌశల్. 'బిగ్‌బాస్ హౌస్‌లో నీ వైఖరి నాకు చాలా బాగా నచ్చింది. ఈ సీజన్‌లో బోల్డ్ అండ్ బ్యూటీకి నువ్వో ట్రంప్ కార్డ్ లాంటిదానివి. నువ్వు ఇంత త్వరగా బయటకు వచ్చేయడం బాధగా ఉంది, నిన్ను మళ్లీ షోలో చూస్తానని ఆశిస్తున్నాను' అని పేర్కొంటూ 'లహరి కమ్ బ్యాక్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు లహరి రీఎంట్రీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment