వోల్వో లగ్జరీ కార్లలో కొత్త వేరియంట్లు | Volvo launches new S60, XC60 versions priced up to Rs 46.55 lakh | Sakshi
Sakshi News home page

వోల్వో లగ్జరీ కార్లలో కొత్త వేరియంట్లు

Published Thu, Oct 24 2013 12:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

వోల్వో లగ్జరీ కార్లలో కొత్త వేరియంట్లు

వోల్వో లగ్జరీ కార్లలో కొత్త వేరియంట్లు

 న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా రెండు మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్‌లో బాగా అమ్ముడయ్యే మోడళ్లలోని ఎస్ 60, ఎక్స్‌సీ60 కార్లలో కొత్త వేరియంట్‌లను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ పేర్కొంది. ఎస్ 60 ధరలు రూ.29.90 లక్షల నుంచి రూ.35.50 లక్షలు, క్రాసోవర్ ఎస్‌యూవీ, ఎక్స్‌సీ 60 ధరరూ.40.50 లక్షల నుంచి రూ.46.55 లక్షల(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయని వివరించింది.  గత ఏడాది 811 కార్లు అమ్ముడయ్యాయని, ఈ ఏడాది వెయ్యి కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వోల్వో ఆటో ఇండియా ఎండీ టోమస్ ఇర్న్‌బర్ చెప్పారు. 2020 కల్లా ఏడాదికి 20 వేల కార్లను అమ్మడం లక్ష్యమని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement