Volvo Auto India
-
భారత్‌పై వోల్వో ఫోకస్.. దేశంలో తొలిసారిగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, ట్రక్కుల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో గ్రూప్ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా వెహికల్ టెక్‌ల్యాబ్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేసింది. ల్యాబ్‌లో వర్చువల్ రియాలిటీ, హ్యూమన్ బాడీ మోషన్ ట్రాకింగ్ ఆధారిత సిమ్యులేటెడ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయంగా ఉన్న వోల్వో ఇంజనీర్లు ఈ వేదికపైకి వచ్చి వాహనాల అభివృద్ధిలో వర్చువల్‌గా పాలుపంచుకుంటారు. వాహనాల అభివృద్ది సమయం గణనీయంగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది. దేశీయ వాహన తయారీ రంగంలో ఇటువంటి ల్యాబ్ స్థాపించడం ఇదే తొలిసారి. బెంగళూరులో సంస్థకు ఆర్అండ్డీ కేంద్రం ఉంది. స్వీడన్ వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా భారత్ అవతరించిందని వోల్వో తెలిపింది. 2024 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం లక్ష్యమని వెల్లడించింది. ఆటోమేషన్, ఎలక్ట్రోమొబిలిటీ, కనెక్టివిటీ విభాగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, కొత్త వ్యాపార నమూనాలను అవలంబించే పనిలో ఉన్నట్టు వివరించింది. -
లగ్జరీ కార్ల సంస్థ వోల్వో షాకింగ్ నిర్ణయం..!
ప్రముఖ స్వీడిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, సిట్రోయెన్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెంచుతున్నుట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాటి బాటలోనే ప్రముఖ స్వీడిష్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో ఆయా కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. భారీగా పెరగనున్న ధరలు..! పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను అధిగమించడానికి భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎంపిక చేసిన కారు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు వోల్వో ప్రకటించింది. సుమారు ఆయా కారు మోడళ్లపై సుమారు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల మధ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపు కారణం అదే..! గత కొన్ని సంవత్సరాలుగా అస్థిరమైన ఫారెక్స్ పరిస్థితులు, గ్లోబల్ సప్లై చైయిన్‌లో అంతరాయం, కోవిడ్-19 ప్రేరిత పరిమితులు, ద్రవ్యోల్బణాల కారణంగా ఇన్పుట్ల ఖర్చులు పెరగడంతో ఆయా కార్ల ధరల పెంపు అనివార్యమని వోల్వో ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త రేట్స్ ఇలా ఉంటాయి...? వోల్వో కార్ ఇండియా సవరించిన ధరల ప్రకారం.... కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని ఎస్యూవీ ఎక్స్‌సీ40 టీ4 ఆర్ వేరియంట్ ధర రూ. 2 లక్షలకు పైగా పెరగనుంది.దీంతో ఈ కారు రూ. 43.25 లక్షలకు లభించనుంది. దాంతో పాటుగా వోల్వో ఎక్స్‌సీ60 బీ5 ఇన్స్క్రిప్షన్ ఎస్యూవీ ధర రూ. 1.6 లక్షలు పెరిగి రూ. 63.5 లక్షలుగా ఉండనుంది. అదే విధంగా వోల్వో సెడాన్ పోర్ట్‌ఫోలియోలోని వోల్వో సెడాన్ ఎస్90 ధర సుమారు రూ. 3 లక్షలు పెరిగి, రూ. 64.9 లక్షలకు చేరనుంది. కంపెనీలోని టాప్-ఎండ్ ఎస్యూవీ ఎక్స్‌సీ90 ధర సుమారు రూ. 1 లక్ష పెరిగి, సుమారు రూ. 90.9 లక్షలకు లభించనుంది. చదవండి: హ్యుందాయ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..! -
వోల్వో నుంచి 7 సీటర్ వెహికల్.. భద్రతకు భరోసా
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వాహన తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా ఎస్యూవీ ఎక్స్‌సీ90 కొత్త వెర్షన్ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.89.9 లక్షలు.ఏడు సీట్ల సామర్థ్యంతో 1,969 సీసీ పెట్రోల్ మైల్డ్–హైబ్రిడ్ ఇంజన్, ఇన్ట్యూటివ్ టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్, అత్యాధునిక ఎయిర్ క్లీనర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, లేన్ కీపింగ్ ఎయిడ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మందువైపు కొలీషన్ మిటిగేషన్ సపోర్ట్, వెనుకవైపు కొలీషన్ వార్నింగ్, మిటిగేషన్ సపోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డీజిల్ నుంచి పెట్రోల్ వైపు మళ్లేందుకే ఈ కొత్త వెర్షన్‌ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. -
వోల్వో ‘వీ90 క్రాస్ కంట్రీ’ కొత్త వెర్షన్
ధర రూ. 60 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో ఆటో ఇండియా’ తాజాగా తన క్రాస్ఓవర్ మోడల్ ‘వీ90 క్రాస్ కంట్రీ’లో కొత్త వెర్షన్‌ను బుధవారం భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.60 లక్షలు. ఇందులో ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్, 8 స్పీడ్ గేర్‌బాక్స్ సహా రాడార్ ఆధారిత భద్రతా ఫీచర్లైన లేన్ కీపింగ్–ఎయిడ్, ఫుల్ ఆటో–బ్రేకింగ్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. -
వోల్వో కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో ఆటో ఇండియా’ కార్ల ధరలను 2.5% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరుగుదల కారణంగా వాహన ధరలు పెంచుతున్నామని తెలిపింది. ఈ కంపెనీ దేశీ మార్కెట్లో రూ.25.49 లక్షలు–రూ.1.25 కోట్ల ధరల శ్రేణిలో కార్లను విక్రయిస్తోంది. కాగా బీఎండబ్ల్యూ, హోండా తదితర కంపెనీలు కూడా వాహన ధరలను ఏప్రిల్ నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
తెలంగాణలో వోల్వో ప్లాంటు..!
వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ వాన్ బాన్స్‌డోర్ఫ్ రేసులో కర్ణాటక, చెన్నై కూడా.. • మార్కెట్లోకి ఎక్స్‌సీ 90 టీ8 ఎక్స్‌లెన్స్ • దేశంలోని తొలి హైబ్రిడ్ ఎస్యూవీ ఇదే • ఈ ఏడాది ముగింపు నాటికి విపణిలోకి ఎస్ 90 • మొత్తం అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 10 శాతం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తెలంగాణలో కార్లు, ట్రక్కుల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలను యూరోపియన్ దిగ్గజం ‘వోల్వో’ పరిశీలిస్తోంది. స్వీడన్‌కు చెందిన ఈ అంతర్జాతీయ దిగ్గజం... దేశంలో తొలి ప్లాంటును ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. తెలంగాణతో పాటు కర్ణాటక, చెన్నై ప్రాంతాల్ని ప్లాంటు ఏర్పాటుకు అనువైనవిగా గుర్తించి, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ వాన్ బాన్స్‌డార్ఫ్ తెలియజేశారు. ‘‘ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, రాయితీలను పరిశీలించిన అనంతరం ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై తుది నిర్ణయానికి వస్తాం. ఆ తరవాతే పెట్టుబడుల వివరాలను వెల్లడించి స్థల సేకరణకు ఉపక్రమిస్తాం’’ అని బాన్స్‌డార్ఫ్ తెలియజేశారు. స్వీడన్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ‘ఐకియా’... ఇండియాలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో తొలి హైబ్రీడ్ కారు ‘ఎక్స్‌సీ90 టీ 8 ఎక్స్‌లెన్స్’ను ఆవిష్కరించిన సందర్భంగా బుధవారమిక్కడ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ వివరాలివీ... ఆడి, బెంజ్ వంటి ఇతర లగ్జరీ కార్లతో పోలిస్తే ఇండియాలో వోల్వో అమ్మకాలు తక్కువగా ఎందుకుంటున్నాయి? నిజమే! ఆడి, బెంజ్ వంటి ఇతర లగ్జరీ కార్లతో పోలిస్తే దేశంలో వోల్వో అమ్మకాలు తక్కువే. కారణం దేశంలో కార్ల తయారీ యూనిట్ లేకపోవటమే. ప్రస్తుతం మాకు బెల్జియం, స్వీడన్లో తయారీ యూనిట్లు, మలేసియా, థాయ్‌లాండ్‌లో అసెంబుల్డ్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ వోల్వో కార్లను తయారు చేసి కంప్లీట్ బిల్ట్ యూనిట్స్ (సీబీయూ) ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాం. అదే పోటీ కంపెనీలు విదేశాల నుంచి కార్ల విడిభాగాలను మాత్రమే కంప్లీట్ నాక్డ్ డౌన్ యూనిట్స్ (సీకేడీ) ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుని ఇక్కడి ప్లాంట్లలో అసెంబుల్ చేస్తున్నాయి. సీకేడీ కన్నా సీబీయూ దిగుమతి సుంకం రెండింతలు ఎక్కువ. ఆ లెక్కడ ఖరీదు పెరుగుతుంది కనక మా అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. మరి మీరూ ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేయొచ్చు కదా? ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. తెలంగాణతో పాటు చెన్నై, కర్ణాటక ప్రాంతాలను పరిశీలనలో ఉన్నాయి. మరి ఈ అమ్మకాలు మున్ముందు పెరుగుతాయని భావిస్తున్నారా? దేశంలో 2013-14లో 1,202, గతేడాది 1,400 లగ్జరీ కార్లను విక్రయించాం. ఈ ఏడాది ముగిసే నాటికి 2 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏటా 25-30 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. మొత్తం వోల్వో కార్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 10 శాతం వరకూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం లగ్జరీ కార్ల పరిశ్రమలో మాది 6 శాతం వాటా. 2020 నాటికి 10 శాతం వాటాతో 10 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యిస్తున్నాం. మార్కెట్లోకి కొత్త మోడళ్లేమైనా తెస్తున్నారా? ప్రస్తుతం దేశంలో వోల్వో.. ఎస్ 60, ఎస్ 60 ఎస్‌క్రాస్ కంట్రీ, ఎస్ 80, వీ 40, వీ 40 క్రాస్ కంట్రీ, ఎక్స్‌సీ 60, ఎక్స్‌సీ 90 మొత్తం 7 లగ్జరీ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది ముగిసే నాటికి ఎస్ 90 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 16 షోరూమ్‌లున్నాయి. అమ్మకాలు పుంజుకోవటానికి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ షోరూమ్‌లను ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి జైపూర్, లక్నో, పుణె నగరాల్లో షోరూమ్‌లను ప్రారంభిస్తాం. విపణిలోకి ఎక్స్‌సీ 90 టీ 8 ఎక్స్‌లెన్స్ దేశంలోని తొలి హైబ్రిడ్ ఎస్యూవీ ధర రూ.1.25 కోట్లు దేశీయ విపణిలోకి ఎక్స్‌సీ 90 టీ 8 ఎక్స్‌లెన్స్ విడుదలైంది. దేశంలోని తొలిసారిగా హైబ్రిడ్ ఎస్యూవీ, రాడార్ సేఫ్టీ కారు ఇదేనని కంపెనీ తెలిపింది. ప్యూర్, హైబ్రిడ్, పవర్ మూడు రకాల డ్రైవింగ్ అవకాశాలుండటం టీ 8 ప్రత్యేకత. దీంతో మనకెలా కావాలనుకుంటే ఆ మోడ్‌లో కారును నడిపే వీలుంటుందన్నమాట. ప్యూర్‌లో.. ఒక్కసారి కారును చార్జింగ్ చేస్తే 40 కి.మీ. వరకూ ప్రయాణించొచ్చు. హైబ్రిడ్‌లో.. ఇంధన వినియోగం చాలా తక్కువగా ఉండటంతో పాటూ సీఓ2 విడుదల చాలా తక్కువ. కి.మీ. ప్రయాణానికి 49 గ్రాముల సీవో 2ను విడుదల అవుతుంది. ఇక పవర్ మోడ్‌లో.. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోడ్ రెండూ ఉంటాయి. దీంతో కేవలం 5.6 సెకన్లలో 0-100 కి.మీ. వేగానికి చేరుకుంటాం. 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ దీని సొంతం. కారు ధర రూ.1.25 కోట్లు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో). కారు చార్జింగ్ కోసం రెండు చార్జింగ్ స్టే షన్లను కూడా అందిస్తుంది. బ్లూ, ఎలక్ట్రిక్ సిల్వర్, బ్రైట్ సిల్వర్, తెలుపు, నలుపు, గ్రే రం గులు అం దుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 50 కార్లు బుకింగ్ అయ్యాయని.. ఈ ఏడాది ముగింపు నుంచి డెలివరీ ప్రారంభిస్తామని టామ్ వోన్ తెలిపారు. -
మార్కెట్లోకి వోల్వో ‘వి40’ లగ్జరీ కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో హాచ్బ్యాక్ విభాగంలో ‘వి40’ మోడల్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యాధునికమైన టెక్నాలజీ, సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ ‘వి40’ని రూపొందించినట్లు వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ టామ్ వన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘వి40’ కారుని లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా పాదచార్లను ఢీకొట్టినా, వారికి తీవ్ర గాయాలు కాకుండా ఉండే విధంగా కారు బయట కూడా ఎయిర్‌బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కారులో మొత్తం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో డ్రైవర్‌తో సహా కారులో ప్రయాణించే వారందరికీ పూర్తి భద్రత ఉంటుందన్నారు. కెనటిక్, ఆర్-డిజైన్ అనే రెండు వేరియంట్స్‌లో 40 లభిస్తుందని, కెనటిక్ ధరను రూ. 24.75 లక్షలు (ఎక్స్ షోరూం ధర), ఆర్-డిజైన్ ధర రూ. 27.7 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. దేశీయ లగ్జరీ కార్ల అమ్మకాల్లో వృద్ధి తగ్గుతోందని, ఈ ఏడాది 10 - 12 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు టామ్ తెలిపారు. పరిశ్రమ రేటు కంటే అధిక వృద్ధిరేటును వోల్వో నమోదు చేస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న ఎస్యూవీ ‘ఎస్ఎక్స్ 90’ను ఈ ఏడాది చివర్లోగా విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఎస్ఎక్స్ -90 ధర రూ. 65-70 లక్షలు ఉండే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతేడాది తెలంగాణలో 300 యూనిట్లు, విశాఖపట్నంలో 100 యూనిట్లు విక్రయించామని, ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. త్వరలోనే విజయవాడలో మరో షోరూంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం వోల్వో అమ్మకాల్లో ఒక్క హైదరాబాద్ వాటా సుమారు 20 శాతంగా ఉండటంతో వి-40 కారు విడుదలను ఇక్కడ విడుదల చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
వోల్వో లగ్జరీ కార్లలో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా రెండు మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్‌లో బాగా అమ్ముడయ్యే మోడళ్లలోని ఎస్ 60, ఎక్స్‌సీ60 కార్లలో కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ పేర్కొంది. ఎస్ 60 ధరలు రూ.29.90 లక్షల నుంచి రూ.35.50 లక్షలు, క్రాసోవర్ ఎస్యూవీ, ఎక్స్‌సీ 60 ధరరూ.40.50 లక్షల నుంచి రూ.46.55 లక్షల(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని వివరించింది. గత ఏడాది 811 కార్లు అమ్ముడయ్యాయని, ఈ ఏడాది వెయ్యి కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వోల్వో ఆటో ఇండియా ఎండీ టోమస్ ఇర్న్బర్ చెప్పారు. 2020 కల్లా ఏడాదికి 20 వేల కార్లను అమ్మడం లక్ష్యమని పేర్కొన్నారు.