రాజీవ్ కోసమే స్వీడన్ బోఫోర్స్ దర్యాప్తు ఆపేసింది
న్యూఢిల్లీ: నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి తలవంపులు వస్తాయనే ఉద్దేశంతోనే అప్పట్లో బోఫోర్స్ ఆయుధాల కుంభకోణంపై స్వీడన్ దర్యాప్తు ఆపేసిందని సీఐఏ పత్రాలు వెల్లడించాయి. విచారణ మరింత కొనసాగితే బోఫోర్స్ ఆయుధాల ఒప్పందంలో భారత అధికారులకు ముడుపులు ముట్టినట్లు వెల్లడవుతుందని స్వీడన్ భావించినట్లు ఆ పత్రాల్లో పేర్కొన్నారు.
1988లో అప్పటి ప్రధాని రాజీవ్ స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ పర్యటన అనంతరం బోఫోర్స్‌పై ప్రత్యేక పోలీసు దర్యాప్తు ఆగిపోయిందని అదే ఏడాది మార్చి 4 నాటి సీఐఏ నివేదిక చెబుతోంది. బోఫోర్స్ స్కాం ఆరోపణల ఫలితంగానే రాజీవ్ గాంధీ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.