స్వీడన్: లాక్‌డౌన్ తర్వాత జనాలు రెస్టారెంట్‌కు ఎగబడే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ కరోనా తగ్గినప్పటికీ అంత ఈజీగా ముందు పరిస్థితులు మళ్లీ కనిపించకపోవచ్చు. దీంతో మారనున్న పరిస్థితులకు అనుగుణంగా ఓ వినూత్న రెస్టారెంట్‌ను తయారుచేశారో చోట. ఇక్కడ మనం ఆర్డర్ చేసే ఫుడ్‌ను ఎవరూ వచ్చి సర్వ్ చేయరు. కిచెన్ నుంచే వేడి వేడి ఆహారాన్ని తాడు సహాయంతో పంపిస్తారు. ఈ ఆలోచన ఒకత్తైతే, కేవలం రోజుకు ఒక్కరినే అనుమతించడం మరో ఎత్తు. ఇంతకీ ఈ రెస్టారెంట్ స్వీడన్‌లో సిద్ధమవుతోంది. అక్కడ సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తూనే కస్టమర్లకు రుచికరమైన ఆహారంతోపాటు కొత్త అనుభూతిని పంచనుంది. (ఇళ్ల ముందు నుంచే కనిపిస్తున్న హిమాలయాలు)
ఇక అక్కడకు వచ్చేవారికి ప్రత్యేకంగా గదులు అంటూ ఉండవు. బయట గార్డెన్‌లో ఒక డైనింగ్ టేబుల్, ఒక కుర్చీ పెట్టి ఉంచుతారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంచక్కా కడుపు నిండేవరకు లాగించేయడమే. ఈ రెస్టారెంట్‌కు "బార్డ్ ఫర్ ఎన్" లేదా "టేబుల్ ఫర్ వన్" అన్న పేర్లను ఆలోచిస్తున్నారు. దీన్ని మే 10న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాస్మస్ పర్సన్, లిండా కార్ల్‌సన్ దంపతులకు వచ్చిందీ ఐడియా. ప్రపంచంలోనే ఏకైక కరోనా సురక్షిత రెస్టారెంట్‌గా దీన్ని మారుస్తామని లిండా పేర్కొంది. ఈ రెస్టారెంట్‌కు అందరూ ఆహ్వానితులేనంటోంది. కాగా యూరప్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పాఠశాలలు, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకోవచ్చని సడలింపులు ఇచ్చింది. అయితే అన్ని చోట్లా సామాజిక ఎడబాటును పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. (నోట్లో బాటిల్ మెడలో పాము)
Comments
Please login to add a commentAdd a comment