న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ రోడ్డును స్వీడన్ పరీక్షిస్తోంది. గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన స్వీడన్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం, ఎలక్ట్రిక్ సదుపాయాలు తదితరాలను పూర్తిచేసింది. మధ్య స్వీడన్ లోని జ్వీల్ నగరానికి సమీపంలో నిర్మిస్తున్న ఈ రోడ్డును ప్రస్తుతం రీయల్ ట్రాఫిక్ లో ట్రక్కులను నడపడం ద్వారా పరీక్షిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ వాహనతయారీ సంస్థ స్కానియా తయారుచేసిన ఎలక్ట్రిక్ ట్రక్కులను ఇందుకు వినియోగిస్తున్నారు. సిమన్స్ కంపెనీ రెండు కిలోమీటర్లపాటు ప్రత్యేకంగా తయారుచేసిన ఈ-16 మోటార్ వే మీద వీటిని పరీక్షిస్తున్నారు.
బయో డీజిల్ తో నడిచే స్కానియా ట్రక్కులకు బస్సు పైభాగంలోని పాంటోగ్రాఫ్ పవర్ కలెక్టర్ ద్వారా విద్యుచ్చక్తిని అందిస్తున్నారు. కదులుతున్నప్పుడు ఎలక్ట్రిక్ వైర్ల నుంచి విద్యుత్తును అవసరమైనప్పుడు వినియోగిచేందుకు లేనప్పుడు ఆపివేసేందుకు వీలును కల్పించారు. దీంతో విద్యుచ్చక్తిని వినియోగించుకోనపుడు సాధారణ ఇంజన్ మీద ట్రక్కు నడిచే అవకాశం కలుగుతుంది. డ్రైవర్ ముందు వెళుతున్న వాహనాన్ని దాటాలని భావించినా.. ఇది ఉపయోగపడుతుంది. దేశాన్ని శిలాజ ఇంధన వనరుల మీద ఆధారపడకుండా 2030లోగా సొంతంగా ఎనర్జీ తయారుచేసుకుని వినియోగించాలని స్వీడన్ నిర్ణయించుకున్న తర్వాత ప్రవేశపెట్టిన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి.
ఎలక్ట్రిక్ రోడ్డు వచ్చేస్తోంది!
Published Thu, Jun 23 2016 5:29 PM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM
Advertisement
Advertisement