గ్రహాన్ని మింగేసిన సూర్యుడు!
లండన్: మిస్టరీగా ఉన్న తొమ్మిదో గ్రహాన్ని సూర్యుడు 4,500 కోట్ల ఏళ్ల క్రితమే మింగేసి ఉంటాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సౌరకుటుంబంలో అదే మొదటి బాహ్యగ్రహం కావొచ్చని అంచనా. శాస్త్రీయ అంశాల అది ప్రకారం మన సౌరకుటుంబానికి వెలుపల ఉండాలి కానీ అది మన సౌరకుటుంబంలో భాగమే.
స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి ఆధారాలున్నాయంటున్నారు. నక్షత్రాలు సమూహాలుగా ఉన్నప్పుడు అవి ఒకదాన్ని మరోటి దాటి వెళుతుంటాయి. ఆ సందర్భంలోనే సూర్యుడు ఈ గ్రహాన్ని మింగేసి ఉంటాండంటున్నారు ఈ శాస్త్రవేత్తలు.