మూడు ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సోమవారం స్వీడన్‌కు చేరుకున్నారు. స్టాక్‌హోమ్‌కు చేరుకున్న ఆయన్ను స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లొఫ్‌నెస్ స్వయంగా ఘన స్వాగతం పలికారు.మోదీ బస చేసే హోటల్ వద్దకు భారీ ఎత్తున చేరుకున్న ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. అనంతరం ఇరు దేశాల వ్యాపార దిగ్గజాలతో సమావేశమవుతారు. స్వీడన్ పర్యటన అనంతరం జర్మనీ, బ్రిటన్‌లలో మోదీ పర్యటిస్తారు.