
శంషాబాద్: గోవా నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ విదేశీయుడు మతి స్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించాడు. స్వీడన్‌కు చెందిన అలెగ్జాడ్రా జాక్ ఫ్ల్రీవ్ (35) అనే వ్యక్తి ఢిల్లీ వెళ్లడానికి గోవాలో శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం ఎక్కాడు. అయితే, విమానం ప్రయాణిస్తుండగానే.. అతడు వింతగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా సీటులో నుంచి లేచి తాను వేసుకున్న దుస్తులు విప్పేసి అటూఇటూ పరిగెత్తాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అలెగ్జాడ్రాను అదుపు చేసి తిరిగి దుస్తులు వేసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం విఫలమవడంతో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అతడిని సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు. వారు అతడిని అదుపులోకి తీసుకొని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అలెగ్జాడ్రాను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. అతడి శరీరంపై ఎర్రటి మచ్చలు ఉండటంతో డ్రగ్స్ తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment