న్యూఢిల్లీ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తి ప్రపంచ దేశాలను కదిలించిన స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్‌బెర్గ్‌కు మరో గుర్తింపు లభించింది. ఆమె రాసిన తొలి పుస్తకం ‘నో వన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఏ డిఫరెన్స్’ కు ‘వాటర్‌స్టోన్స్ ఆథర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు లభించింది. వాటర్‌స్టోన్స్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పుస్తకాల సంస్థ. ప్రపంచ పర్యావరణ రక్షణ ఆవశ్యకత గురించి గ్రేటా వివిధ దేశాల్లో చేసిన ప్రసంగాల సంకలమే ‘నో వన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఏ డిఫరెన్స్’ పుస్తకం. ఇది గత మే నెలలో మార్కెట్‌లోకి వచ్చింది.
ఈ పుస్తకంతోపాటు ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్, ది హార్స్’ పుస్తకానికి కూడా చార్లీ మ్యాక్సేకు ‘ఆథర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు లభించింది. పిల్లల్లో నీతిని పెంపొందించే ఈ పుస్తకం వెయ్యి ప్రతులను మాత్రమే ప్రచురించారు. డిమాండ్ మేరకు మళ్లీ మళ్లీ ప్రచురించడంతో 20 వేల ప్రతులు ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి గ్రేటా పేరు నామినేట్ అయిన విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment