స్వీడన్ లో కాల్పుల కలకలం
స్ట్రాక్ హోమ్: స్వీడన్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. దక్షిణ స్వీడన్ లోని మాల్మో నగరంలో ఆదివారం రాత్రి స్కూటర్ పై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఇందులో నలుగురు గాయపడ్డారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.స్థానికులు హుటాహుటిన వీరిని ఆస్పత్రికి తరలించారు. రెండు స్కూటర్లపై వచ్చిన నలుగురు ముఖానికి మాస్కులు ధరించి 20 రౌండ్లు కాల్పులు జరిపిపారిపోయారని స్వీడన్ మీడియా వెల్లడించింది.సాధారణంగా ప్రశాంతంగా ఉండే స్వీడన్ లో కాల్పులు చోటు చేసుకోవడంతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యులు చేపడుతున్నారు.