మోదీ పర్యటనపై అమెరికా అసంతృప్తి
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఇది భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచి్చంది. ‘‘పుతిన్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసింది.
వాషింగ్టన్‌లో నాటో సదస్సు జరుగుతుండగా మోదీ రష్యాలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. పుతిన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నాటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ కాంప్‌బెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రాతో మాట్లాడారు.
మోదీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు’’ అని నివేదిక వివరించింది. ఈ ఉదంతంపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్‌లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ గురువారం మీడియాతో సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవి రష్యా పర్యటనను ఉద్దేశించేనని చెబుతున్నారు. రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment