విల్నియస్ : లిథువానా రాజధాని విల్నియస్ వేదికగా జరుగుతున్న నాటో దేశాల సమావేశాల నేపథ్యంలో ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వంపైనా ఆ దేశానికి ఆయా సభ్య దేశాల మద్దతు ఎలా ఉంటుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా సమావేశం అనంతరం భోజనానికి ముందు అతిధులందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఒంటరిగా కనిపించారు. అదే సమయంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఒంటరిగా ఉన్న ఈ ఫోటోపై కామెంట్లు కూడా అంతే సెటైరికల్ గా ఉన్నాయి. నాటో కూటమి ఒక అస్థిరమైన కూటమి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు నాటో దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి అందుకే ఆయనను ఒంటరిగా వదిలేశారని ఒకరు రాయగా.. నాటో సమావేశాల్లో ఇదీ ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి.. అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.
అసలు విషయమేమిటంటే అప్పటివరకు పక్కనే ఉన్న వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఓలెనా జెలెన్స్కీ మరో అతిధిని పలకరించేందుకు ఒక అడుగు పక్కకు జరిగింది. దీంతో ఒక్కరే ఉన్న ఫోటో బయటకు రావడంతో రకరకాల కథనాలను పుట్టించారు నెటిజన్లు.
ఇదిలా ఉండగా నాటో సమావేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు సందేశమిస్తున్న సమయంలో అతని భార్య ఓలెనా జెలెన్స్కీ ఆయన పక్కనే ఉన్నారు. సమావేశంలో ఆయా దేశాలు రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కు తమ సహకారం ఉంటుందని ప్రకటించాయి. ఎటొచ్చి నాటో సభ్యత్వంపైనే స్పష్టత లేని హామీలనిచ్చాయి.
ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..?
Comments
Please login to add a commentAdd a comment