పడమటి సంధ్యారాగం | US election fever | Sakshi
Sakshi News home page

పడమటి సంధ్యారాగం

Published Sat, Nov 5 2016 11:54 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

పడమటి సంధ్యారాగం - Sakshi

పడమటి సంధ్యారాగం

సిటీబ్యూరో/బంజారాహిల్స్ : గ్రేటర్‌కు ఇప్పుడు అమెరికా ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్,  రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి ట్రంప్‌ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొనడంతో ఇక్కడ చర్చలు ఊపందుకున్నారుు.  ఈ నెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగరంలో ప్రతినోటా ఇవే మాటలు వినిపిస్తున్నారుు.  గ్రేటర్ నగరానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధ మేంటీ అనుకుంటున్నారా..? నగరానికి చెందిన పలువురు సిటీజన్లకు సంబంధించిన బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు వేలాదిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దశాబ్దాల క్రితమే వెళ్లి స్థిరపడ్డారు. వారిలో పలువురు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోనే కాదు...పలు ప్రముఖ కంపెనీలకు సారథులుగానూ ప్రాచుర్యం పొందారు.

వీరిలో చాలామందికి అక్కడ ఓటు హక్కు ఉంది. ఇక ఉభయ రాష్ట్రాలకు చెందిన మన తెలుగువారు ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ, ట్రంప్ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థారుులోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరంలోని పలువురు ఎన్‌ఆర్‌ఐలు కూడా అక్కడికి పయనమయ్యారు. ఇప్పటికే నగరంలో నివసిస్తున్న పలువురు ఎన్‌ఆర్‌ఐలు తమ ఆబ్సెంటీ ఓటు(పోస్టల్ బ్యాలెట్ తరహా)ను వినియోగించుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరి క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా పోటీ పడుతుండగా గత నెల రోజుల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం వేడెక్కింది. నగరంలోని ఎన్‌ఆర్‌ఐలే కాకుండా అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు కూడా ఈ ఎన్నికలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన తమ పిల్లలు, బంధు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్‌లో, ఫేస్‌టైమ్ కాల్ చేసినపుడు..లేదా వాట్సప్ ..ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసినపుడు ఇదే అంశంపై చర్చోపచర్చలు..విశ్లేషణలు జోరందుకున్నారుు.

కొందరు ఏకంగా బెట్టింగ్‌లకు సైతం దిగుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అమెరికా నుంచి వస్తున్న సమాచారాన్ని, ఎన్నికల విశ్లేషణలను, సర్వేలను గమనిస్తూ ఇప్పటికే తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణరుుంచుకొని ఆ మేరకు హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో తమ ఆబ్సెంటీ ఓటును వినియోగించుకోవడం విశేషం. మరికొందరు ఇప్పటికే అమెరికాకు చేరుకొని అక్కడ స్వయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణరుుంచుకొని బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కలిగినవారు మన నగరంలో 3646 మంది ఉండగా ఇందులో 80 శాతం మంది తమ ఓటు హక్కును ఆబ్సెంటీ ఓటు విధానం ద్వారా వినియోగించుకున్నారు. మిగతావారు అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అమెరికాలో అర్హత గల మొత్తం ఓటర్లు 21 కోట్ల 90 లక్షలుకాగా 2016 ఎన్నికల్లో ఓటు వేయడానికి రిజిష్టర్ చేసుకున్న ఓటర్లు మాత్రం 14 కోట్ల 63 లక్షల మంది ఉన్నారు. ఇందులో పురుషులు 69 శాతం కాగా, మహిళలు 73 శాతం ఉన్నారు.  ఈ ఎన్నికల్లో ఓటర్ల ట్రెండ్‌పై నగరానికి చెందిన పలువురు  ఎన్‌ఆర్‌ఐల మనోగతం ఇలా ఉంది.

హోరాహోరీ పోటీ...
అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ, ట్రంప్‌లు హోరాహోరీగా తలపడనున్నారు. ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యంతోనే అన్నది నా అంచనా. హిల్లరీ గెలిస్తే ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం, ఉద్యోగ వీసాల నిబంధనలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ట్రంప్ గెలిస్తే ఈ విధానాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం తథ్యం. కొత్తగా ఉద్యోగాలు, చదువులకోసం .వచ్చే తెలుగువారికి స్వల్ప ఇబ్బందులు తప్పవు. రాజకీయంగా హిల్లరీకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఎవరు గెలిచినా అమెరికాలో ఉద్యోగ ,వ్యాపార రంగాల్లో స్థిరపడిన తెలుగు వారి భవిష్యత్‌కు ఢోకా ఉండదని భావిస్తున్నాం.
ఏసిరెడ్డి కరుణాకర్‌రెడ్డి,  అమెరికా తెలుగు సంఘం(అటా)అధ్యక్షులు

కలుపుకొని పోయేవారికే మద్దతు
అమెరికా ఎన్నికల్లో కలుపుకొని పోయేవారికే మా మద్దతు ఉంటుంది. అరుుతే కొంత మంది పొగరుబోతు తనంతో దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. వారిని నివారించాలంటే అనుభవం ఉన్నవారికే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇంకోవైపు అమెరికాలో ధనవంతులకు, పేదలకు మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. దాన్ని తగ్గించే విధానాలను హిల్లరి తీసుకోనుంది.
- శనన్, ఎన్‌ఆర్‌ఐ

దేశాన్ని విడగొట్టేవారికి దూరం
దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సింది పోరుు విడగొట్టే మనస్తత్వం ఉన్న వారికి ఈ ఎన్నికల్లో జనం బుద్ది చెప్పనున్నారు. అమెరికా చరిత్రలోనే ఒక మహిళ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నది. అమెరికాకు మహిళ అధ్యక్షురాలు కావాలని కలలు కంటున్నవారికి ఇదొక మంచి అవకాశం. ట్రంప్‌కు నైతిక విలువలు ఎంత మాత్రం లేవు. మహిళల పట్ల గౌరవం అసలే లేదు. హిల్లరీకి దేశం ఐక్యంగా ఉండాలన్న లక్ష్యం ఉంది.  - శ్యాం సుంకర, ఎన్‌ఆర్‌ఐ

సమర్ధులకే మా ఓటు
ఎన్నికల్లో స్వయంగా పాల్గొని ఓటు వేసేందుకు అమెరికాకు చేరుకున్నాం. అరుుతే ఓటు ఎవరికి వేసేది నిర్ణరుుంచుకోలేదు. దేశాన్ని సమైక్యంగా ఉంచి పేద, ధనికుల మధ్య తారతమ్యాన్ని తగ్గించి విద్య, వైద్యానికి పెద్దపీట వేసేవారికే ఎన్నికల్లో ఓటువేస్తాం. హిల్లరి క్లింటన్ కలిసి ఉంటేనే బలం అనే నినాదంతో ముందుకు వెళ్తుండగా ట్రంప్ మాత్రం అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తాననే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇద్దరినీ గమనిస్తున్నాం.    - ప్రీతి

అందర్నీ గౌరవించే వారికే...
అమెరికా ఎన్నికల్లో ఇప్పటికే మేం ఓటు వేశాం. అరుుతే అందరినీ గౌరవించేవారికే మద్దతు తెలిపాం. ఓ అభ్యర్ధి ఇతరులపట్ల చిన్నచూపు చూస్తున్నాడు. అలాంటివారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉంది.  - పి.అనురాధ, ఎన్‌ఆర్‌ఐ

ఇంకా నిర్ణరుుంచుకోలేదు
ఈ నెల 8వ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు మేం నివసిస్తున్న గ్రీన్‌‌సబోరో సిటీకి చేరుకున్నాం. ఇంకా ఓటు ఎవరికి వేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరి అభిప్రాయాలను గమనిస్తున్నాం. ఇద్దరిలో దేశానికి మంచి చేసేవారికి మద్దతు ఇవ్వాలని తలపెట్టాం. పోలింగ్‌రోజునే ఎవరికి ఓటు వేయాలో నిర్ణరుుంచుకుంటాం. - సురేందర్‌గుప్తా, ఎన్‌ఆర్‌ఐ

అధ్యక్ష పదవికి ట్రంప్ తగని వ్యక్తి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ ఆ పదవికి ఎంత మాత్రం తగిన వ్యక్తి కాదు. నేనైతే హిల్లరి క్లింటన్‌కే మద్దతు తెలిపాను. ఇప్పటికే ఆబ్సెంటీ ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఆమె ప్రచార నినాదం కలిసి ఉంటేనే బలం అన్నది నాకు బాగా నచ్చింది. బేదభావాలు లేకుండా ఉండాలన్నదే ఆమె ఆకాంక్ష.               - పెనుమల్లి భాస్కర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ

హిల్లరీకి అనుభవమే ప్లస్..
రాజకీయ అనుభవంలో హిల్లరీ క్లింటన్‌దే ప్రత్యేకత. ఆమె అనుభవాలు అమెరికా అభివృద్ధికి దోహదపడతారుు. న్యూయార్క్ రాష్ట్రంలో సెనేటర్‌గా పని చేసినప్పుడు ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించారు. విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. - ప్రతాప్, ఎన్‌ఆర్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement