
ఈ ఓటమి ఎంతో బాధిస్తోంది: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటమి తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింట్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ముందుగా ఎన్నికలలో తమ పార్టీకి తోడ్పాడు అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని హిల్లరీ అంగీకరించారు. పార్టీ ఓటమి చెందటం చాలా బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో మనం గెలవలేకపోయాం... అమెరికన్ల కలలు ఎంతో ఉన్నతమైనవి.. మన కలలు నేరవేర్చుకునేందుకు సమిష్టిగా కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఎన్నికలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పరిపాలనలో విజయవంతంగా రాణిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైతేనేం అధ్యక్ష ఎన్నికలకు హోరాహోరీగా ప్రచారం జరిగిందని, చివరికి తమ ప్రత్యర్థిని విజయం వరించిందన్నారు. డోనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్(270 సీట్లు) చేరుకున్న వెంటనే హిల్లరీ తన ప్రత్యర్థికి పోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ముందస్తు సర్వేలు హిల్లరీదే విజయమని విస్తృత ప్రచారం జరిగినా మిశ్రమ ఫలితాలు వచ్చాయి.