హిల్లరీదే విజయం.. ట్రంప్‌కు షాక్‌! | Clinton Has 90 percent Chance of Winning | Sakshi
Sakshi News home page

హిల్లరీదే విజయం.. ట్రంప్‌కు షాక్‌!

Published Tue, Nov 8 2016 8:32 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

హిల్లరీదే విజయం.. ట్రంప్‌కు షాక్‌! - Sakshi

హిల్లరీదే విజయం.. ట్రంప్‌కు షాక్‌!

హిల్లరీకి 90 శాతం విజయావకాశం: సర్వే
నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు


న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనా లేక రిపబ్లికన్‌ డోనాల్డ్ ట్రంపా? ఎవరు గెలిస్తే ఎలా ఉంటుందంటూ ప్రపంచ దేశాలు లాభనష్టాలను బేరీజువేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో హిల్లరీ గెలుపు ఖాయమంటూ తుది, తాజా సర్వే వెల్లడించింది. హిల్లరీకి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని, ట్రంప్నకు షాక్‌ తప్పదంటూ రాయిటర్స్/ఇప్సాస్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మొదట్నుంచి హిల్లరీయే ముందంజలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణల కారణంగా ట్రంప్ వెనుకబడిపోయారు. ఆ తర్వాత పోటీ హోరాహోరీగా మారిందని, ఓ దశలో ట్రంపే స్వల్ఫ తేడాతో ముందున్నారంటూ సర్వేలు చెప్పాయి. కాగా ఎన్నికల తేదీ సమీపించేసరికి పరిస్థితి హిల్లరీకి పూర్తిగా అనుకూలంగా మారింది. ఈ మెయిల్స్ వ్యవహారంలో ఎఫ్బీఐ క్లీన్‌ చిట్ ఇవ్వడం కూడా ఆమెకు కలసివచ్చింది. హిల్లరీ గెలిచే అవకాశం 64 శాతం ఉందని సర్వేలు తేల్చగా, తాజా, తుది సర్వేలో విజయావకాశాల శాతం 90కి పెరిగింది. ఇక వైట్‌ హౌస్ రేసులో ట్రంప్ ఆశలు రోజురోజుకు సన్నగిల్లిపోతున్నాయి.

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక కావాలంటే ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు అవసరం కాగా హిల్లరీ 303 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధిస్తారని సర్వేలో తేలింది. ట్రంప్కు 235 ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఇక పాపులర్ ఓట్లు హిల్లరీకి 45 శాతం, ట్రంప్కు 42 శాతం వస్తాయని అంచనా వేసింది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి జరిగే అమెరికా ఎన్నికల్లో దాదాపు 15 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement