అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట్లో ప్రమాదం | Fire breaks out at Hillary and Bill Clintons house in Chappaqua | Sakshi
Sakshi News home page

అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట్లో ప్రమాదం

Published Thu, Jan 4 2018 11:42 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

Fire breaks out at Hillary and Bill Clintons house in Chappaqua - Sakshi

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని చాపక్వాలో ఉన్న క్లింటన్‌ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్టు మంగళవారం మధ్యాహ్నం సమాచారం అందినట్టు న్యూకాజిల్‌ పోలీసులు తెలిపారు. దాంతో హుటాహుటిన అక్కడ చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై క్లింటన్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ నిక్ మెరిల్ స్పందించారు. స్పల్ప అగ్నిప్రమాదమే జరిగిందని, ఎవరికీ ప్రమాదం జరగలేదని ఆయన వెల్లడించారు. ప్రమాద సమయంలో క్లింటన్‌ దంపతులు ఇంట్లో లేరన్నారు. కాగా క్లింటన్‌, హిల్లరీలు 1999 లో ఆ ఇంటిని కొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement