'కుక్కలు పట్టడానికి కూడా హిల్లరీ పనికిరాదు'
ఆంబ్రిడ్జ్: 'మీడియానే.. అంతా మీడియానే చేస్తోంది. ఒక్కసారి మీడియా పక్కకు తప్పుకుంటే అప్పుడు బయటపడుతుంది.. హిల్లరీ క్లింటన్ అసలు స్వరూపం. మీడియా సపోర్ట్ లేకపోతే కనీసం కుక్కలు పట్టే ఉద్యోగం కూడా దొరక్కపోయేది. అలాంటావిడా నన్ను విమర్శించేది?' అంటూ డెమోక్రటిక్ అభ్యర్థిపై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు.
పెన్సిల్వేనియా లోని ఆంబ్రిడ్జ్ లో మంగళవారం నిర్వహించిన ప్రచార సభలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఎప్పుడో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడిన మాటల్ని వీడియోలు చేసి ప్రదర్శిస్తూన్నారని, మీడియా కూడా రెండు మూడు రోజులపాటు వాటినే హెడ్ లైన్స్ గా వేశాయని, ఇలాంటి వ్యర్థప్రయత్నాలు మానుకుంటే మంచిదని అన్నారు. ఇంత చెప్పినా వీడియోలు రిలీజ్ చేయడం మానుకోకపోతే.. హిల్లరీ కుటుంబానికి చెందిన రహస్యాలు బయటపెడతానని హెచ్చరించారు.
'హిల్లరీ భర్త బిల్ క్లింటన్.. ఓ సెక్స్ ప్రిడేటర్ (ఇతర జంతువులను చంపితినే జంతువు) అమెరికా అధ్యక్ష చరిత్రలోనే.. ఆయనంతగా మహిళల్ని ఎవ్వరూ వేధించలేదు. బిల్ క్లింటన్ బారినపడ్డ మహిళల్ని ఓదార్చకపోగా హిల్లరీ వాళ్లను మళ్లీ బెదిరించేది. నాపై విమర్శలు మానుకోకుంటే వాళ్ల బండారం బయటపెడతా' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.