
‘అగ్ర’ పీఠం కోసం నువ్వా.. నేనా?
నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా చరిత్రలోనే అత్యంత విద్వేషపూరిత ఎన్నికల ప్రచారం
ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్న 4.2 కోట్ల మంది
- ఫలితం తారుమారు చేయనున్న స్వింగ్ స్టేట్స్
- ఫ్లోరిడా, ఒహయో, న్యూహ్యాంప్‌షైర్, నెవడా, పెన్సిల్వేనియా, వర్జీనియాలపై ఆసక్తి
- తాజా సర్వేలో హిల్లరీకి 292 ఎలక్టోరల్ ఓట్లు; నేనే గెలుస్తా: ట్రంప్
వాషింగ్టన్: పరస్పర ఆరోపణలు... విద్వేష ప్రసంగాల మధ్య అమెరికన్లకే అసహ్యం పుట్టించేలా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముగిసింది. శ్వేతసౌధ అధిపతిని ఎన్నుకునే అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. చివరి నిమిషం వరకూ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌లు ప్రచారంలో కత్తులు దూసుకున్నారు. ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, జాతి వ్యతిరేక వ్యాఖ్యల్ని హిల్లరీ అస్త్రాలుగా చేసుకోగా, ఈమెరుుల్ వివాదంలో ఆమె దోషి అని ట్రంప్ విరుచుకుపడ్డారు. దేశాధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంత వివాదాస్పద, విద్వేషపూరిత ప్రచారం ఎన్నడూ జరగలేదన్నది విశ్లేషకుల, సర్వేల అభిప్రాయం. చివరి నిమిషంలో హిల్లరీ వర్గానికి ఎఫ్‌బీఐ ఊరట నిస్తూ.. ఈమెరుుల్ వివాదంలో ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టబోమంది. ఈఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే దేశాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ అవుతారు. ట్రంప్ గెలిస్తే అత్యధిక వయసున్న అధ్యక్షుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇప్పటికే 4.2 కోట్ల మంది ముందస్తుగా ఓటేశారు.
నార్త్ కరోలినాలో హిల్లరీ, మిచిగన్‌లో ట్రంప్: తన చివరి ప్రచారాన్ని హిల్లరీ సోమవారం అర్ధరాత్రి(భారత కాలమానం మంగళవారం మధ్యాహ్నం) నార్త్ కరోలినాలో ముగిస్తుండగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మిచిగన్‌లోని గ్రాండ్ రాపిడ్‌స ప్రచారానికి ముగింపు పలుకుతారు. అమెరికా గుర్తింపును నాశనం చేస్తోన్న విదేశీ శక్తుల్ని వెనక్కి పంపేందుకు ఈ ఎన్నికలు చివరి అవకాశమని ట్రంప్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. మహిళలు, మైనార్టీల సమానత్వం దిశగా దేశ ప్రయాణం ప్రమాదంలో పడొచ్చని హిల్లరీ హెచ్చరించారు.
స్వింగ్‌స్టేట్స్‌లో మాదేగెలుపు: ట్రంప్
ఫలితాన్ని నిర్ణరుుంచే రాష్ట్రాల్లో రిపబ్లికన్ ఆధిక్యంలో ఉందని, శ్వేతసౌధంలో తన ప్రవేశానికి రంగం సిద్ధమైందని సోమవారం ప్రచారంలో ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు మీడియా, పోల్ సంస్థల్ని ఆశ్చర్యపర్చడం ఖాయమన్నారు. ‘మనం గెలవబోతున్నాం. కొలరాడోలో గెలుస్తాం. నెవెడాలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. నార్త్ కరోలినా, వర్జీనియాలో మన పార్టీ పుంజుకుంది. ఫ్లోరిడాను గెలవబోతున్నాం’ అని అని అన్నారు. చివరి రెండు రోజుల్లో ట్రంప్ అయోవా, కొల రాడో, మిన్నియాపొలిస్, మిచిగన్, పెన్సిల్వేనియాలో ర్యాలీలు నిర్వహించారు. హిల్లరీ పెన్సిల్వేనియా, ఒహయో, న్యూ హ్యాంప్‌షైర్ ప్రచారంలో పాల్గొన్నారు.
భారతీయ ఉద్యోగులపై ట్రంప్ అక్కసు..అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ముస్లింలు అమెరికాలో ప్రవేశించకుండా తాత్కాలిక నిషేధం విధించాలని, మెక్సికో సరిహద్దు వెంట గోడ కట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వలసవాదుల్ని రేపిస్టులు, నేరస్తులుగా చిత్రీకరించారు. 2005 నాటి వీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడి తీవ్ర దుమారం సృష్టించారు. ఈ వివాదం వెలుగులోకి వచ్చాక... 12 మంది మహిళలు ట్రంప్‌కు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ తెరపైకి వచ్చారు. ఇక సొంత పార్టీలోనే అనేక మంది ట్రంప్‌కు మద్దతివ్వలేదు. అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎన్నికల ఫలితం వెలువడ్డాకే... దాన్ని అంగీకరించాలా? లేదా? అన్నది స్పష్టం చేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఆదివారం కూడా ట్రంప్ భారత ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు. మిన్నియాపొలిస్‌లో మాట్లాడుతూ... ఐబీఎం 500 మంది ఉద్యోగుల్ని తొలగించి భారతీయ, ఇతర దేశాల ఉద్యోగుల్ని నియమించుకుందని ఆరోపించారు. తాను అధ్యక్షుడినైతే అలాంటి కంపెనీలపై 35 % పన్ను విధిస్తానని హెచ్చరించారు.
ఫ్లోరిడాలో, ఒహయో, న్యూహ్యాంప్‌షైర్ ఫలితాలపై ఆసక్తి
అమెరికాలో పోలింగ్ (ఈస్ట్రన్ టైం జోన్ రాష్ట్రాల్లో) భారత కాలమానం ప్రకారం నవంబర్ 9 ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. అలాస్కాలో నవంబర్ 9 మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. జార్జియా, సౌత్ కరోలినా, వెర్మాంట్, ఇండియానా, కెంటకీల్లో నవంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి ఫలితం జార్జియా నుంచి వెలువడే అవకాశముంది. ఆ రాష్ట్రంలో రిపబ్లికన్‌స ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అరగంట అనంతరం ... ఒహయో, నార్త్ కరోలినా ఫలితాలు వస్తారుు. ఒహయోలో హిల్లరీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా... నార్త్ కరోలినాలో రిపబ్లికన్‌లు కొద్దిపాటి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అసలు ఆసక్తి అంతా ఫ్లోరిడాపైనే. ఏదైనా తేడా జరిగితే తప్ప ఈ రాష్ట్రం ఎవరి ఖాతాలోకి వెళ్తే వారే అమెరికా అధ్యక్షుడు అవడం ఖాయం. న్యూ హ్యాంప్‌షైర్ ఫలితం కూడా ఆసక్తి కలిగించేదే. మొదటి నుంచి డెమోక్రాట్లకు పట్టున్న ఈ రాష్ట్రంలో హోరాహోరీ పోరు నెలకొంది. అరిజోనా, టెక్సాస్ ఫలితాలు మాత్రం హిల్లరీకి నిరాశ కలిగించడం ఖాయం. డెమోక్రాట్లకు పట్టున్న కొలొరాడో, మిచిగన్, విస్కాన్సన్‌లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నారుు.
హిల్లరీనే విజేత: సర్వే
ఎన్నికలకు రెండ్రోజుల ముందు నిర్వహించిన పోల్స్ హిల్లరీనే విజేతగా తేల్చేశారుు. నవంబర్ 7న ఫైవ్‌థర్జీఎరుుట్ వెబ్‌సైట్ పోల్ ప్రకారం హిల్లరీకి 65.3 శాతం గెలుపు అవకాశాలున్నారుు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో హిల్లరీకి 292, ట్రంప్‌కు 245 ఓట్లు వస్తాయి. సీబీఎస్ న్యూస్ సర్వే ప్రకారం హిల్లరీకి 45 శాతం, ట్రంప్‌కు 41 శాతం మద్దతు పలికారు. ఇక రియల్‌క్లియర్ పాలిటిక్స్ సరాసరి పోల్స్‌లో హిల్లరీ కంటే ట్రంప్ 2 పారుుంట్లు వెనకబడ్డారు. ట్రంప్‌కు 245 ఓట్లు వస్తారుు. హిల్లరీకీ 48.3 శాతం, ట్రంప్‌కు 45.4 శాతం పాపులర్ ఓట్లు వస్తాయని వెబ్‌సైట్ పేర్కొంది.
హిల్లరీకి ఎఫ్‌బీఐ తీపి కబురు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరొక రోజు సమయం ఉందనగా హిల్లరీ క్లింటన్‌కు ఎఫ్‌బీఐ తీపి కబురు అందించింది. ఈమెరుుల్ వివాదంలో అమెపై క్రిమినల్ నేరారోపణ అవసరం లేదని తేల్చిచెప్పింది. కొత్తగా వెలుగుచూసిన ఈమెరుుల్స్ క్షుణ్నంగా పరిశీలించాక ఈ నిర్ణయం ప్రకటించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి గెలుపు మరింత సులభం కానుంది. ఎఫ్‌బీఐ డైరక్టర్ జేమ్స్ బి కోమే వివరాలు వెల్లడిస్తూ...‘మా సమీక్ష ప్రకారం.. జూలైలో మేం వెల్లడించిన అభిప్రాయాన్ని ప్రస్తుతం మార్చుకోలేదు. 24 గంటలూ మా సిబ్బంది పనిచేసి మొత్తం ఈమెరుుల్స్‌ను పరిశీలించారు. క్రిమినల్ నేరం మోపాల్సిన వివరాలేమీ దొరకలేదు’ అని పేర్కొన్నారు. ఈ పరిణామంతో క్లింటన్ శిబిరం ఆనందంలో మునిగిపోరుుంది. 2 వారాల క్రితం హిల్లరీ తాజా ఈమెరుుల్స్ వివాదంతో ఒక్కసారిగా ఆమె ఆధిక్యం తగ్గిపోరుుంది. ఒక దశలో ట్రంప్ హోరాహోరీ పోరు ఇచ్చారు. ఎఫ్‌బీఐ తాజా ప్రకటనను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుపడుతూ హిల్లరీని కాపాడుతున్నారని ఆరోపించారు. ఎఫ్‌బీఐ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నానని, ఇంత తక్కువ సమయంలో 6.5 లక్షల మెరుుల్స్‌ను ఎలా పరిశీలించారంటూ ప్రశ్నించారు. హిల్లరీ దోషి అని, అది ఆమెకు, ఎఫ్‌బీఐకు తెలుసని చెప్పారు.