
దూసుకుపోయిన హిల్లరీ...
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉన్న ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే బిగ్ డిబేట్లలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ దూసుకుపోయింది. గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన మూడు బిగ్ డిబేట్లలో హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
సీఎన్‌ఎన్/ఓఆర్‌సీ సర్వే వెల్లడించిన ఫలితాల ప్రకారం
► తొలి చర్చలో హిల్లరీ విజయం సాధించారని 62% ఓటర్లు పేర్కొనగా, 27% మాత్రం ట్రంప్‌దే విజయమని తెలిపారు.
► రెండో బిగ్ డిబేట్లో హిల్లరీకి 57 శాతం, ట్రంప్‌కు 34 శాతం మద్దతు పలికారు.
► మూడో బిగ్ డిబేట్లో హిల్లరీకి 52 శాతం, ట్రంప్కు 39శాతంమద్దతు పలికారు.
నవంబర్ 8న ఓటర్లు ఎలక్టర్స్‌ను ఎన్నుకుంటే, డిసెంబర్‌లో ఎలక్టర్స్.. అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేస్తారు. 2017 జనవరి ప్రథమార్ధంలో కాంగ్రెస్.. ఎలక్టర్స్ ఓట్లను లెక్కించి, అధికారికంగా గెలిచిన అభ్యర్థుల (అధ్యక్ష, ఉపాధ్యక్ష) పేర్లను ప్రకటిస్తుంది. కానీ, వాస్తవానికి నవంబర్ 8న అభ్యర్థుల జయాపజయాలు తెలిసిపోతాయి. 2017, జనవరి 20న అమెరికా 45వ అధ్యక్ష, 48వ ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తారు.