
కౌంటింగ్ సమయంలో ట్రంప్ ఎక్కడ..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం కౌంటింగ్ మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎన్నికల ఫలితాలను గమనిస్తున్నాయి. ట్రంప్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారంటే.. ఆయన తన అపార్ట్మెంట్లో డైట్ కోక్ తాగుతూ టీవీలో ఎన్నికల ఫలితాలను చూస్తున్నారు. ట్రంప్ స్నేహితుడు, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియాని ఈ విషయం చెప్పారు.
ట్రంప్ టవర్లో ఆయన సన్నిహితులు, కొందరు రిపబ్లికన్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. పలు రాష్ట్రాల నుంచి వెలువడుతున్న ఎన్నికల ప్రాథమిక ఫలితాలను ట్రంప్ టీవీలో చూస్తున్నారని రూడీ చెప్పారు. ట్రంప్ ప్రశాంతంగా ఉన్నారని, తాము ఫలితాలను విశ్లేషిస్తూ ట్రంప్ గెలుస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ట్రంప్ ఇంకా డిన్నర్ చేయలేదని చెప్పారు.