ట్విట్టర్ రికార్డు బ్రేక్
శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల వల్ల సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్ పండగ చేసుకుంది. ఎన్నికల రోజు ట్విట్టర్లో 3.5 కోట్ల ట్వీట్లు చేశారు. ఇదే అత్యధిక రికార్డు. బుధవారం ఉదయం 7:30 నిమిషాల వరకు అమెరికా ఎన్నికలకు సంబంధించి ట్విట్టర్లో 3.5 కోట్ల కంటే ఎక్కువ ట్వీట్లు పోస్ట్ చేశారు.
2012లో జరిగిన అమెరికా ఎన్నికల రోజున అత్యధికంగా 3.20 కోట్లకు పైగా ట్వీట్లు చేశారు. తాజాగా ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. ట్విట్టర్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు కోటి 31 లక్షల మంది, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు కోటి నాలుగు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికాలో మంగళవారం ఓటింగ్ జరిగింది. తర్వాత కౌంటింగ్‌ను ప్రారంభించారు. ట్రంప్ మెజార్టీ విజయానికి చేరువయ్యారు.